మెగాస్టార్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. ఆకాశంలో ఇలా..
మెగాస్టార్ చిరంజీవి తన జీవిత భాగస్వామి సురేఖతో కలిసి తన వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు.
By: Tupaki Desk | 20 Feb 2025 10:55 AMమెగాస్టార్ చిరంజీవి తన జీవిత భాగస్వామి సురేఖతో కలిసి తన వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఆ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ, సురేఖ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రత్యేకంగా స్పెషల్ ఫ్లయిట్ లో దుబాయ్ బయలు దేరిన వారు ఈ వేడుకను ఆకాశం మధ్యలో ప్రయాణిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.
ఇక మెగాస్టార్ తనకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు కూడా ఈ ప్రయాణంలో ఉండడం విశేషం. ముఖ్యంగా నాగార్జున, అమలతో పాటు నమ్రతతో దిగిన ఫొటోలను మెగాస్టార్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అలాగే మరికొందరు దగ్గరి మిత్రులు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ ఫ్రేమ్ లో లేనట్లు తెలుస్తోంది.
ఇక మెగాస్టార్ సతీమణి గురించి ఈ విధంగా వివరించారు
"నా జీవిత భాగస్వామిగా సురేఖను పొందడం నా అదృష్టం అని ఎప్పుడూ అనుకుంటాను. ఆమె నా బలం, నా ఆధారం, నా ఆత్మవిశ్వాసం. ఈ ప్రపంచంలోని తెలియని మార్గాల్లో నన్ను నడిపించే శక్తిగా నిలుస్తుంది. ఆమె ఉనికి ఒక శాశ్వతమైన ధైర్యం, ఒక అద్భుతమైన ప్రేరణ. ఆమె నాకెంత ముఖ్యమో, ఆమెతో నా జీవితం ఎంత సంతోషమో చెప్పుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను.. అని తెలియజేశారు.
అలాగే ధన్యవాదాలు నా ప్రియమైన సౌల్‌మెట్ అంటూ ఇలాంటి మరిన్ని సందర్భాలను కలిసి జరుపుకుంటూ, నా ప్రేమను, గౌరవాన్ని నిన్ను గూర్చి వ్యక్తపరచడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. అని అన్నారు. అత్యంత ముఖ్యంగా, మా స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, మరియు మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! శుభం కలుగుగాక!.. అంటూ మెగాస్టార్ తన పోస్ట్ లో తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, మెగాస్టార్ ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు వశిష్ట్, 'బింబిసార'తో హిట్ కొట్టి, మెగాస్టార్‌తో ఈ బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా చిరు ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ ఏడాది చివరికి 'విశ్వంభర' థియేటర్లలో సందడి చేయబోతోంది.
ఇక ‘విశ్వంభర’ తర్వాత చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేశారు. భగవంత్ కేసరి-సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్స్ ఇచ్చిన అనిల్, చిరు కోసం ఓ మాస్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది. ఎప్పుడూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లకు ప్రాధాన్యం ఇచ్చే అనిల్ రావిపూడి, చిరు కోసం యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసిన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్. అలాగే, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ తో కూడా చిరు ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.