అందాల త్రిషతో అన్నయ్య డ్యూయెట్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా విశష్ట దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య సోషియా ఫాంటసీ థ్రిల్లర్ `విశ్వంభర` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 19 Nov 2024 9:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా విశష్ట దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య సోషియా ఫాంటసీ థ్రిల్లర్ `విశ్వంభర` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ కి జోడీగా అందాల త్రిష నటిస్తోంది. ఇప్పటి వరకూ షూటింగ్ అంతా దాదాపు హైదరాబాద్ లోనే జరిగింది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్లు నిర్మించి చేసారు. సోషియా ఫాంటసీ చిత్రం కావడంతో ఔట్ డోర్ షూటింగ్ కి పెద్దగా లేదు.
తొలి షెడ్యూల్ మారే డుమిల్లి మినహా షూట్ అంతా భాగ్యనగరానికే పరిమితమైంది. ఇప్పటికే షూటింగ్ తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ జపాన్ లో మొదలవుతుంది. జపాన్ అందాల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అక్కడే చిరంజీవి-త్రిషలపై ఓ డ్యూయెట్ కూడా ప్లాన్ చేస్తోంది యూనిట్. హైదరాబాద్ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి జపాన్ లో ఈ స్పెషల్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సోషియా ఫాంటసీ సినిమా కావడంతో డ్యూయెట్లకు ఛాన్స్ ఉండదు. కానీ కమర్శియల్ యాస్పెక్ట్ లో డ్యూయెట్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చిరు-త్రిష కలిసి స్టాలిన్ చిత్రం కోసం డ్యూయెట్లు వేసుకున్నారు. ఆ పాటల్లో చిరు-త్రిష కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. తాజాగా మరోసారి అదే జోడీతో డ్యూయెట్ అంటే? ఫ్యాన్స్ కి దిల్ ఖుష్. పైగా త్రిష అందం వయసుతో పాటు పెరుగుతుంది. ఈ మద్య కాలంలో త్రిష షాట్స్ నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే.
చిరు వయసును సైతం త్రిష ఇప్పుడు మ్యాచ్ చేయగలదు. ఈ నేపథ్యంలో చిరుతో డ్యూయెట్ ఫ్యాన్స్ తో విజిల్ వేయించేలా ఉంటుంది. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ పాటకు ఏ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు? అన్నది తెలియాలి.