Begin typing your search above and press return to search.

మెగాస్టార్ లైన్ అప్ లో క్రేజీ మూవీస్

ఇదిలా ఉంటే దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి లైన్ అప్ లో ముగ్గురు దర్శకులు ఉన్నారు.

By:  Tupaki Desk   |   2 Feb 2025 12:30 PM GMT
మెగాస్టార్ లైన్ అప్ లో క్రేజీ మూవీస్
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహాలో ఈ మూవీ కథాంశం ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి లైన్ అప్ లో ముగ్గురు దర్శకులు ఉన్నారు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కి నిర్మాతలు కూడా కన్ఫర్మ్ అయిపోయారు.

ఎంత బడ్జెట్ అయిన పెట్టడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉన్నారు. అయితే వీటిలో ఏది ముందుగా పట్టాలు ఎక్కుతుందనేదానిపై క్లారిటీ లేదు. చిరంజీవి కూడా ఈ మూడు కథలపై ఆసక్తిగానే ఉన్నారు. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో మూవీ చేయబోతున్నాడు. SLV సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది.

ఈ మూవీకి సంబందించిన ప్రీలుక్ పోస్టర్ కూడా ఇప్పటికే విడిచిపెట్టారు. హైవోల్టేజ్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందంట.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పారు. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దీంతో పాటు బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు టాక్. గతంలో వీరిద్దరూ ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు మరో కథని చిరంజీవికి నేరేట్ చేసి బాబీ ఒకే చేయించుకున్నారంట.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మెగా ఫ్యాన్స్ ఈ మూడు సినిమాల పైన ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుందనేది వేచి చూడాలి. ఫ్యాన్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలలో చూడాలని అనుకోవడం లేదు.

ఇదిలా ఉంటే ‘విశ్వంభర’ మూవీ సమ్మర్ హాలిడేస్ లో మే 9న రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ కి జోడీగా త్రిష నటిస్తోంది. అలాగే మరో నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. బింబిసార లాంటి హిట్ తర్వాత వశిష్ట మల్లిడి నుంచి ఈ మూవీ వస్తోన్న నేపథ్యంలో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.