Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ‘విశ్వంభర’.. ఎంతవరకు వచ్చిందంటే?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న భారీ చిత్రం విశ్వంభర కోసం ఓ వర్గం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 March 2025 7:00 PM IST
మెగాస్టార్ ‘విశ్వంభర’.. ఎంతవరకు వచ్చిందంటే?
X

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తున్న భారీ చిత్రం విశ్వంభర కోసం ఓ వర్గం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ హై రేంజ్ లో నిర్మిస్తోంది. ఇక ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ వర్గాల్లో హైప్ నెలకొంది.

చిరంజీవి సినిమాలు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాయి. విశ్వంభర విషయంలోనూ అదే జరగనుంది. అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, నెవ్వర్ బిఫోర్ అనే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌ను చూపించబోతుందని సమాచారం. చిరు పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని, ఆయన క్యారెక్టర్ డిజైన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉండబోతుందని టాక్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి.

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. చిరంజీవి పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలన్నీ షూట్ చేసేశారు. క్లైమాక్స్ పార్ట్, యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్ అన్నీ పూర్తయ్యాయి. గత రెండు నెలలుగా చిత్ర బృందం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌లో పాల్గొంటూ చివరి దశ పనులను ముగించారు. చిరు కెరీర్‌లోనే ఇది అత్యంత వేగంగా పూర్తయిన పెద్ద సినిమాల్లో ఒకటిగా నిలవబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికి చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తయింది. మిగిలింది కేవలం ఓ ఐటెం సాంగ్ మాత్రమే. వచ్చే నెలలో ఆ స్పెషల్ సాంగ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. ఈ పాట సినిమాలో హైలైట్ కానుందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ ప్రముఖ నటి రాబోతోందని, ఆమె పేరు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో చిరంజీవి సినిమాల్లో ఐటెం సాంగ్స్ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

వాల్తేరు వీరయ్య లో ఊర్వశి రౌతేలా చేసిన ఐటెం సాంగ్ భారీ హిట్ అయిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే స్థాయిలో హై ఎనర్జీ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇకపోతే, విశ్వంభర సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. హై లెవెల్ గ్రాఫిక్స్ వర్క్‌తో సినిమాను మరింత గ్రాండియర్‌గా మలచేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా మారనుందట. ఇక సంక్రాంతి 2025లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా సమ్మర్ కు రావాల్సింది. కానీ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సమ్మర్ చివరకు షిఫ్ట్ అయినట్లు టాక్.