విశ్వంభర ఆగమనం ఎప్పుడు..?
'భోళా శంకర్' డిజాస్టర్ గా మారిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన సినిమా "విశ్వంభర". బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది.
By: Tupaki Desk | 22 Jan 2025 5:30 PM GMT'భోళా శంకర్' డిజాస్టర్ గా మారిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన సినిమా "విశ్వంభర". బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈపాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనుకున్న ఈ చిత్రాన్ని, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కోసం వాయిదా వేసుకున్నారు. మేకర్స్ ఇంకా తదుపరి విడుదల తేదీని ప్రకటించలేదు.
'విశ్వంభర' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చెయ్యాల్సి ఉంది. సినిమాని సమ్మర్ సీజన్ లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై టీమ్ సైడ్ నుండి ఇంకా ఎలాంటి అఫిషియల్ అప్‌డేట్ రాలేదు. మరోవైపు వేసవిలో మంచి డేట్స్ అన్నీ లాక్ అయిపోతున్నాయి. ఇప్పటికే పలు క్రేజీ పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు కర్చీఫ్స్ వేశాయి. మార్చి మొదలుకొని మే నెలాఖరు వరకూ రిలీజ్ చార్ట్ ఫుల్ అయిపోయింది.
ఉగాది, ఈద్ స్పెషల్ గా మార్చి నెలాఖరున అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 'హరి హర వీర మల్లు', 'ది రాజా సాబ్', 'కుబేర', 'రాబిన్ హుడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఘాటి', 'మిరాయ్', 'జాక్', 'కన్నప్ప', 'హిట్ 3', 'మాస్ జాతర' ,VD 12 లాంటి సినిమాలు సమ్మర్ సీజన్ లో రిలీజ్ కాబోతున్నాయి. లూసిఫర్, థగ్ లైఫ్, రెట్రో, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఇడ్లీ కడాయి వంటి మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులోకి రాబోతున్నాయి. వీటి మధ్యలో 'విశ్వంభర' ఎప్పుడు వస్తుందనేదే ఆసక్తికరంగా మారింది.
'విశ్వంభర' సినిమా డిజిటల్ హక్కుల కోసం మేకర్స్ భారీ ధరలను కోట్ చేస్తున్నారట. ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీలు డిజిటల్ హక్కులను భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి వెనకాడుతున్నాయి. ఇప్పుడు చిరంజీవి సినిమాకి కూడా నిర్మాతలు కోట్ చేసిన రేటు పెట్టడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. సమ్మర్ లో ఇప్పటికే ఓటీటీ రిలీజ్ స్లాట్స్ బుక్ అయిపోవడంతో, విశ్వంభర సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
UV క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో 'విశ్వంభర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా విడుదల వాయిదా పడటంతో అదనంగా వడ్డీల భారం పడుతుంది. సో నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలోనే భారీ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే డిజిటల్ డీల్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదని తెలుస్తోంది. ఈరోజుల్లో ఓటీటీ స్లాట్ ను బట్టే థియేట్రికల్ రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు. మరి మెగాస్టార్ మూవీని ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కొనుగోలు చేస్తుందో? మేకర్స్ సినిమాని థియేటర్లలో ఎప్పుడు విడుదల చేస్తారో? చూడాలి.
'గేమ్ చేంజర్' డిజాస్టర్ గా మారడంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు 'విశ్వంభర' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. భోళా శంకర్ ను మర్చిపోయేలా చేస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్‌కి మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రాబోయే రోజుల్లో బజ్ క్రియేట్ చెయ్యడానికి ఎలాంటి కంటెంట్ వదులుతారో చూడాలి.