Begin typing your search above and press return to search.

మెగాస్టార్ బ‌ర్త్ డేకి దిగిపోతారా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'విశ్వంభ‌ర' సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 March 2025 12:39 PM IST
మెగాస్టార్ బ‌ర్త్ డేకి దిగిపోతారా?
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'విశ్వంభ‌ర' సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన 'గేమ్ ఛేంజ‌ర్' కూడా రిలీజ్ కి ఉండ‌టంతో 'విశ్వంభ‌ర' వాయిదా వేసుకున్నారు. దీంతో ప‌నులు కూడా నెమ్మ‌దించాయి. వాయిదా ప‌డిన నాటి నుంచి ప‌నుల‌న్నీ మంద‌గించాయి. అన్ని నెమ్మ‌దిగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ రెండు పాట‌లు మిన‌హా షూట్ అంతా పూర్త‌యింది.

ఈ నేప‌థ్యంలో కొన్ని రోజులుగా 'విశ్వంభ‌ర‌' రిలీజ్ ఎప్పుడు? ఉంటుంది అన్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. మార్చి లేదా వేస‌వి సెల‌వులు సంద‌ర్భంగా రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ సినిమా వేసవిలో రిలీజ్ కాద‌ని తెలుస్తోంది. చిత్రాన్ని ఆగ‌స్టుకి వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. ఆగ‌స్టులో కూడా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట‌.

ఆ రోజున రిలీజ్ చేస్తే మెగా అభిమానుల‌కు కూడా ఓ ట్రీట్ లా ఉంటుంద‌ని చిరంజీవి అండ్ కో ఇలా ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో చిరంజీవి న‌టించిన చాలా సినిమాలు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ అయిన సంద‌ర్భాలున్నాయి. ఈ నేపధ్యంలో 'విశ్వంభ‌ర' విషయంలో అదే సెంటి మెంట్ ఫాలో అవ్వ‌డానికి డిసైడ్ అయిన‌ట్లు వినిపిస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి.

చిరంజీవి బ‌ర్త్ డే అంటే ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున సెల‌బ్రేషన్లు ఉంటాయి. ప‌లుచోట్ల ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేసి భారీ ఎత్తున ర‌క్త సేక‌ర‌ణ జ‌రుగుతుంది. దేశ వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. అందుకు ప్ర‌తిగా చిరంజీవి కూడా అభిమానుల‌కు త‌న‌వంతుగా ఏదో ఒక స్పెష‌ల్ ట్రీట్ ఇస్తుంటారు. ఈసారి ఆ ట్రీట్ విశ్వంభ‌ర రిలీజ్ అవ్వాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.