ఆ స్టార్ సినిమాకేంటి కొత్త ప్రాబ్లమ్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో సోషియా ఫాంటసీ థ్రిల్లర్ `విశ్వంభర` తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 March 2025 5:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో సోషియా ఫాంటసీ థ్రిల్లర్ `విశ్వంభర` తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సినిమాకి సంబంధించి సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ తో పాటు హాంకాంగ్ లోనూ ఆ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్స్ ఏవీ ఇంతవరకూ బయటకు రాలేదు.
సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటికీ రిలీజ్ తేదీపై క్లారిటీ లేకుండా ఉంది. మార్చి తర్వాత ఏప్రిల్..మే రిలీజ్ అన్నారు. అటుపై ఆగస్టు , సెప్టెంబర్ అనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. కానీ తాజా గా అందుతోన్న సమాచారం ప్రకారం చిత్రం జూన్ లేదా? జులైలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయని మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదు.
అలాగే శాటిలైట్ రైట్స్ విషయంలోనూ క్లారిటీ లోపించింది. ఇంత పెద్ద సినిమాకి ఇప్పటివరకూ ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ ఎందుకు అవ్వడం లేదు? అన్నది ఆసక్తికరంగా మారింది. చిరంజీవి సినిమా అంటే కార్పోరేట్ సంస్థలు పోటీకి దిగి మరీ కొంటాయి. అలాంటింది `విశ్వంభర` విషయంలో ఈ డిలే ఎందుకు జరుగుతున్నట్లు? అయితే ఈ సినిమాకి భారీ బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు.
ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి అదే పరిస్థితి. ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలేవి బయటకు రాలేదు.
ఇకపై టీమ్ ప్రత్యేకంగా వీటిపై ఫోకస్ పెట్టి పనిచేయాల్సి ఉంది. అలా చేస్తే తప్ప లాభం లేనట్లే కనిపి స్తుంది. స్టార్ హీరోల సినిమాలంటే సెట్స్ లో ఉండగానే ఓటీటీ, శాటిలైట్ భారీ ధరకు అమ్మడు పోతుం టాయి. చిరంజీవి గత సినిమాలు వేటికి ఇలాంటి సమస్య తలెత్తని సంగతి తెలిసిందే.