Begin typing your search above and press return to search.

విశ్వంభర.. డౌట్స్ అక్కర్లేదు..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Sep 2024 3:29 AM GMT
విశ్వంభర.. డౌట్స్ అక్కర్లేదు..
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ అండ్ సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఆ మూవీని బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. సీనియర్ బ్యూటీ త్రిష.. అనేక ఏళ్ల తర్వాత చిరు సరసన యాక్ట్ చేస్తోంది. త్రిషతో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి పవర్ ఫుల్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అయితే విశ్వంభరలో తన ఇమేజ్ కు తగ్గ పాత్రను చిరు పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని మోకాలిపై కూర్చుని చిరు కనిపించారు. దీంతో మేకర్స్.. సినిమాపై అంచనాలు పెంచేశారు. పోస్టర్ లో వింటేజ్ చిరును చూసినట్లు అనిపించగా.. త్వరలో టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారని సమాచారం.

కాగా.. విశ్వంభర మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్.. సినిమా అనౌన్స్మెంట్ రోజే చెప్పేశారు. ఏడాది ముందే పెద్ద పండక్కి కర్చీఫ్ వేసేశారు. అందుకు తగ్గట్లే షూటింగ్ ప్లాన్ చేసుకుని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అత్యధిక భాగాన్ని కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక సాంగ్, కొంచెం టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్ ఉందట. అదే సమయంలో విశ్వంభర సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

సీజీ వర్క్ ఎక్కువ పెండింగ్ ఉందని, డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన నిర్వాహకులు మూవీ వాయిదా వేయమని చెప్పారని, గేమ్ ఛేంజర్ రిలీజ్ అయిన 20 రోజులకే విడుదల చేయడం ఇష్టం లేదని.. అలా పలు కారణాలతో మేకర్స్ వాయిదా వేస్తున్నారని ప్రచారం సాగింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు డైరెక్టర్ వశిష్ట స్పందించారు. మూవీ పోస్ట్ పోన్ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. అనుకున్న టైమ్ కే సినిమాను రిలీజ్ చేస్తామని నెట్టింట క్లారిటీ ఇచ్చారు దర్శకుడు.

'10-1-2025 విజృంభణం.. విశ్వంభర ఆగమనం!!' అంటూ మల్లిడి వశిష్ట ట్వీట్ చేశారు. జనవరి 10వ తేదీ సినిమా రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. దీంతో విశ్వంభర విడుదల వాయిదా అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది. ప్రస్తుతం మేకర్స్.. ఓవైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. ఇంకోవైపు వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి విజువల్ గ్రాండియర్ గా రానున్న విశ్వంభర మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.