Begin typing your search above and press return to search.

విశ్వంభర.. ఇలా జరిగిందేంటి?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Oct 2024 6:44 AM GMT
విశ్వంభర.. ఇలా జరిగిందేంటి?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉన్నా.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేశారు మేకర్స్. అయితే ఆగస్టు 22వ తేదీన చిరు బర్త్ డే సందర్భంగా మేకర్స్.. టీజర్ ను రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు.

కానీ దసరా కానుకగా నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా టీజర్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. సినిమా కాన్సెప్ట్ అర్థమైందని, ఫాంటసీ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. కానీ వీఎఫ్ ఎక్స్ విషయంలో నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అవతార్, అవెంజర్స్ వంటి పలు హాలీవుడ్ మూవీస్ నుండి రిఫరెన్స్ లు తీసుకున్నారని అంటున్నారు. ఇన్ఫినిటీ వరల్డ్ ట్రైలర్‌ లోని ఒక షాట్‌ తో విశ్వంభర టీజర్‌ లోని ఒక షాట్ మ్యాచ్ అయ్యేలా కనిపిస్తోందని చెబుతున్నారు.

ఆ స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా అని హాలీవుడ్ మూవీస్ పోలిన విజువల్స్ తీసుకున్నా.. అనుకున్నంత స్థాయిలో క్వాలిటీ లేదని అంటున్నారు. టీజర్ కోసం మేకర్స్ చాలా రోజులు కష్టపడ్డా.. సరైన అవుట్ రాలేదని చెబుతున్నారు. ఫ్యాన్స్.. మద్దతు తెలుపుతున్నా కొందరు నెటిజన్లు టీజర్ పట్ల పెదవి విరుస్తున్నారు. అసలు టీజర్ విషయంలో ఎందుకు ఇలా అయిందని అడుగుతున్నారు. ఆడియన్స్ అంచనాలను తక్కువగా అంచనా వేశారని అని అంటున్నారు.

అయితే విశ్వంభర మూవీ అనౌన్స్మెంట్ నుంచే వీఎఫ్ ఎక్స్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో టీజర్ పై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. మేకర్స్.. అందుకే క్వాలిటీ విషయంలో ఓ సారి చెక్ చేసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. టీజర్ ఎలాగో వచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా వీఎఫ్ ఎక్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు కాబట్టి చాలా టైమ్ ఉన్నట్లేనని అంటున్నారు.

అదే సమయంలో టీజర్ విషయంలో వచ్చిన నెగిటివ్ రివ్యూస్ ను తేలిగ్గా తీసుకోవద్దని కొందరు సూచిస్తున్నారు. ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నా.. రివ్యూస్ కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. బింబిసారలో వశిష్ట.. అద్భుతమైన గ్రాఫిక్స్ ను చూపించారు. అది కూడా తక్కువ బడ్జెట్ తోనే.. ఇప్పుడు విశ్వంభరను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాబట్టి వశిష్ట.. ఇంకా క్వాలిటీ వీఎఫ్ ఎక్స్ అందించాలి. మరి ఫైనల్ గా ఏం చేస్తారో చూడాలి.