Begin typing your search above and press return to search.

తండ్రీకొడుకులిద్ద‌రు ఒకేసారి ముగిస్తున్నారా?

రెండ‌ళ్ల‌గా సెట్స్ లో ఉన్న సినిమా ఎట్ట‌కేల‌కు చ‌ర‌ణ్ పోర్ష‌న్ కి సంబంధించి షూట్ క్లైమాక్స్ చేరుకుందిట‌.

By:  Tupaki Desk   |   20 May 2024 2:30 AM GMT
తండ్రీకొడుకులిద్ద‌రు ఒకేసారి ముగిస్తున్నారా?
X

ఎన్నిక‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో మెగా హీరోలంతా మ‌ళ్లీ యాక్ష‌న్ అంటూ రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభ‌ర' షూట్ లో.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' షూట్ లో బిజీ అయ్యారు. అయితే తండ్రీకొడుకులిద్ద‌రు ఒకేసారి షూటింగ్ ముగించ‌బోతున్నారా? ఇద్ద‌రు జూన్ క‌ల్లా షూట్లు పూర్తి చేసి ఫ్రీ అయిపోతారా? అంటే అవున‌నే స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే 'గేమ్ ఛేంజ‌ర్' షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది.

రెండ‌ళ్ల‌గా సెట్స్ లో ఉన్న సినిమా ఎట్ట‌కేల‌కు చ‌ర‌ణ్ పోర్ష‌న్ కి సంబంధించి షూట్ క్లైమాక్స్ చేరుకుందిట‌. జూన్ క‌ల్లా అత‌డి పార్ట్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ ఆర్సీ 16 కి కూడా డేట్లు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. 'గేమ్ ఛేంజ‌ర్' కి సంబంధించి అద‌నంగా రీషూట్ ..పెండింగ్ షూట్ ఏమైనా ఉంటే ఆర్సీ 16 తో పాటు పూర్తి చేయోచ్చు అన్న ధీమాతోనే బుచ్చిబాబు కి డేట్లు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి కూడా జూన్ క‌ల్లా 'విశ్వంభ‌ర' నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని స‌మాచారం.

షూటింగ్ ప్రారంభ‌మైన మారేడుమిల్లి షూట్ మిన‌హా అన్ని షెడ్యూల్స్ లోనూ నిర్విరామంగా చిరు పాల్గొన్నారు. దీంతో ఆయ‌న పార్ట్ షూటింగ్ కూడా ముగింపుకు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే చిరు 157 కూడా ప‌ట్టాలెక్కించే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్లే. జూన్ నుంచి ఖాళీ అయితే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప‌నుల్లో బిజీ అవుతారు. ఇంకా ఆసినిమాకి ద‌ర్శ‌కుడిని పైన‌ల్ చేయాల్సి ఉంది. క‌థ విష‌యంలోనూ కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇవ‌న్నీ జ‌ర‌గాలంటే చిరంజీవి 157 పై అంతే సీరియ‌స్ గా ప‌నిచేయాల్సి ఉంది.

'విశ్వంభ‌ర‌'కి సంబంధించి చిరు అవ‌స‌రం మ‌ళ్లీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యే వ‌ర‌కూ ఉండ‌దు కాబ‌ట్టి అంత‌వ‌ర‌కూ 157 ప‌నుల్లోనే బిజీ అవుతారు. పైగా ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మిస్తున్నారు కాబ‌ట్టి మ‌రింత శ్ర‌ద్ద తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇంకా చిరు క‌మిట్ మెంట్ ఇచ్చిన ద‌ర్శ‌కులు కొంత మంది ఉన్నారు. వాళ్ల‌ను మ‌ళ్లీ ట‌చ్ లోకి తేవాల్సిన అవ‌స‌రం ఉంది.