Begin typing your search above and press return to search.

మెగాస్టార్ న్యూ కాంబో.. క్యారెక్టర్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాని చేసిన మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతుందంట. బివిఎస్ రవి ఈ మూవీకి కథ అందించినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   23 July 2024 9:30 AM GMT
మెగాస్టార్ న్యూ కాంబో.. క్యారెక్టర్ ఇదేనా?
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ కథాంశంతో రెడీ అవుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కనిపించబోతూ ఉండడం విశేషం. మరో 5 మంది అందాల భామలు ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారంట. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో కమర్షియల్ బౌండరీ నుంచి బయటికి వచ్చి చేయబోతున్న సినిమా ఇదే కావడం విశేషం.

దీని తర్వాత కూడా మెగాస్టార్ కాస్త డిఫరెంట్ కథనే ప్రయత్నం చేయబోతున్నారంట. మెగా 157 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాని చేసిన మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతుందంట. బివిఎస్ రవి ఈ మూవీకి కథ అందించినట్లు సమాచారం. అలాగే మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతుందని తెలుస్తోంది.

ఈ ఏడాదిలోనే మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందంట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పెళ్లి అయిన మధ్య వయస్కుడి పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అది నిజమైతే కచ్చితంగా ఇది మెగాస్టార్ కెరియర్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ కథాంశం ప్రజెంట్ లో ఉంటుందా లేదంటే పీరియాడిక్ జోనర్ లో పాన్ ఇండియా అప్పీల్ తో ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న విశ్వంభర మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే చిరంజీవి కథల ఎంపిక కూడా మారే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ కమర్షియల్ లైన్ నుంచి బయటికి వచ్చి డిఫరెంట్ కథలను చేసే ఛాన్స్ ఉంది. మోహన్ రాజా మూవీ కాకుండా మెగాస్టార్ చిరంజీవి హరీష్ శంకర్, మరో యంగ్ డైరెక్టర్ కథలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.

మరి వీటిలో వాస్తవం ఎంత అనేది వచ్చే ఏడాది తెలిసే ఛాన్స్ ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ అంటే కచ్చితంగా కమర్షియల్ లైన్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే డబుల్ ఇస్మార్ట్ మూవీ హిట్ అయితే పూరి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ సినిమా చేయొచ్చని టాక్ నడుస్తోంది.