Begin typing your search above and press return to search.

అన్న‌య్య‌కి ప్లాప్ ఇవ్వ‌కుండా త‌ప్పించుకున్న వేళ‌!

చిరంజీవి డైరెక్ట్ చేయాల్సిందిగా కోర‌గా బాబి సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 8:39 AM GMT
అన్న‌య్య‌కి ప్లాప్ ఇవ్వ‌కుండా త‌ప్పించుకున్న వేళ‌!
X

మాస్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్న బాబి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెర‌కెక్కించిన ఐదు సినిమాల్లో నాలుగు హిట్లు అందుకున్నాడు. విజ‌యం సాధించిన చిత్రాల‌న్నీ త‌న సొంత క‌థ‌ల‌తో రూపొందిన‌వే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కించిన 'స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్' మాత్రం 'గ‌బ్బ‌ర్ సింగ్ 'కి సీక్వెల్ గా రూపొందింది. ఆసినిమాని బాబినే తెర‌కెక్కించాడు. ఇది మాత్రం త‌న సొంత క‌థ కాదు. ప‌వన్ క‌ళ్యాణ్ స్వయంగా రాసిన క‌థ‌. ఈసినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితం సాధించిందో తెలిసిందే.

భారీ అంచ‌నాల మ‌ధ్య రూపొందిన సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి బాబి ప్లాప్ ఇచ్చాడు. అయితే ఆ ప్లాప్ తో సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పిలిపించి మ‌రో రీమేక్ సినిమా చేయ‌మ‌ని అవ‌కాశం ఇచ్చిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మ‌ల‌యాళం హిట్ సినిమా 'లూసీఫ‌ర్' చిత్రాన్ని చిరంజీవి 'గాడ్ ఫాదర్' టైటిల్ తో తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు.

ఈ సినిమాని మోహ‌న్ రాజా తెర‌కెక్కించాడు. అయితే ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం తొలుత బాబికే వ‌చ్చిందిట‌. చిరంజీవి డైరెక్ట్ చేయాల్సిందిగా కోర‌గా బాబి సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. 'తొలి నుంచి నేను తయారు చేసుకున్న కథలను బాగా చేయగలుగుతాను. ఎవరో రాసిన కథలలను ఓన్ చేసుకోలేకపోతున్నాను. అందువలన అవి విజయాన్ని సాధించలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో 'లూసీఫర్' చేయమని చెప్పి నన్ను చిరంజీవిగారు పిలిపించారు. నా బలం .. నా బలహీనత ఏమిటనేది చిరంజీవిగారికి చెప్పాను.

అయితే నువ్వు రాసిన కథను వినిపించు అన్నారు. 20 రోజులు సమయాన్ని ఇవ్వండి అని అడిగాను. ఆ తరువాత 'వాల్తేరు వీరయ్య' కథ రాసుకుని వెళ్లి చెప్పాను. ఆయనకి నచ్చడంతో ఆ ప్రాజెక్టు మొదలైంది. నా ఇబ్బంది ఏమిటనేది చిరంజీవిగారు అర్థం చేసుకోవడంవల్లనే అలా జరిగింది' అని అన్నారు. గాడ్ ఫాద‌ర్ ఫ‌లితం సంగ‌తి తెలిసిందే. లేదంటే ఆ ప్లాప్ కూడా బాబి ఖాతాలో ప‌డేది.