Begin typing your search above and press return to search.

పుష్ప 2 కి మెగా అభయం ఉండేనా..?

అల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేస్తున్న భారీ సినిమా పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

By:  Tupaki Desk   |   20 July 2024 11:30 PM GMT
పుష్ప 2 కి మెగా అభయం ఉండేనా..?
X

అల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేస్తున్న భారీ సినిమా పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా అసలైతే ఈ పాటికి పూర్తి చేసి ఆగష్టు 15 కి రిలీజ్ ప్రమోషన్స్ చేస్తుండాలి కానీ సుకుమార్ తనకు ఇంకా టైం కావాలని అడగడం వల్ల రిలీజ్ వాయిదా వేశారు. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఐతే అల్లు అర్జున్ మీద, పుష్ప 2 మీద మెగా ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తన ఫ్రెండ్ కి సపోర్ట్ గా ఉన్నందుకు మెగా అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కోపానికి కారణమయ్యాడు అల్లు అర్జున్.

ఐతే ఆ ఇంపాక్ట్ పుష్ప 2 మీద పడే అవకాశం ఉందా లేదా అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ చూసి అంచనా వేయొచ్చు. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా చిత్రీకరిస్తున్న ఈ గొడవలు బయట వార్తల్లో వినిపిస్తున్నంత ఉన్నాయా లేదా అనేది తెలియదు కానీ రీసెంట్ గా బన్నీ వాసు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంత డిస్ట్రబెన్స్ అయితే ఉందని తెలుస్తుంది. అయితే విషయాన్ని ఇలానే పొడిగించుకుంటూ పోతే పుష్ప 2 రిలీజ్ టైం కు మరింత ఎఫెక్ట్ పడేలా ఉంది.

అందుకే అల్లు అరవింద్ మెగా ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమా ఏదైనా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయంలో చిరంజీవి వెర్షన్ ఎలా ఉంది అన్నది బయటకు తెలియదు. కానీ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అవ్వడానికి ముందు ఒక మెగాస్టార్ అభిమాని. సో అల్లు అర్జున్, అల్లు అరవింద్ పిలిస్తే చిరు రానని చెప్పే ఛాన్స్ లేదు.

ఇక చిరు పుష్ప 2 ఈవెంట్ కి వస్తే మెగా అభయం ఇచ్చినట్టే. సో అక్కడితే సినిమా పై గొడవ సగం పూర్తైనట్టే. సో మెగాస్టార్ చిరంజీవిని పుష్ప ఈవెంట్ కి రప్పించి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టే ప్లానింగ్ లో ఉన్నారు పుష్ప 2 టీం. ఎలాగు మైత్రి మూవీ మేకర్స్ అటు పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, ఇటు చరణ్ తో బుచ్చి బాబు సినిమా చేస్తున్నారు. సో నిర్మాతల శ్రేయస్సు కోసమైనా సరే మెగా హీరో పుష్ప 2 ఈవెంట్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. చిరు కాకుండా మరెవరైనా వస్తారా అంటే ఇక ఉన్న ఆప్షన్ చరణ్ మాత్రమే మరి చిరు, చరణ్ ఎవరొచ్చినా సరే పుష్ప 2 పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఈ హడావిడి తగ్గే ఛాన్స్ ఉంది.