Begin typing your search above and press return to search.

చాలా కాలానికి మ‌రో స‌హ‌జ‌న‌టిని చూశాను: చిరంజీవి

ఇదే స‌క్సెస్ వేదిక‌ పై మెగాస్టార్ చిరంజీవి డెబ్యూ న‌టి వైష్ణ‌వి చైత‌న్య‌ను ప్రశంస‌ల్లో ముంచెత్తారు.

By:  Tupaki Desk   |   31 July 2023 3:55 AM GMT
చాలా కాలానికి మ‌రో స‌హ‌జ‌న‌టిని చూశాను: చిరంజీవి
X

మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్ర‌శంస‌లు అందుకోవ‌డం అంటే ఆషామాషీనా? ఆయన ఎంత భోళాశంక‌రుడు అయినా అక్క‌డ ప్ర‌తిభ ఉన్న‌పుడే ఆ ప్ర‌శంస ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఆయ‌న త‌న భోళాశంక‌ర్ విడుద‌ల‌కు ముందు బేబి స‌క్సెస్ ఈవెంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఈ వేదిక‌ పై త‌న అభిమానులంద‌రి స‌మ‌క్షం లో బేబి న‌టీన‌టుల న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌ గురించి ప్ర‌శంస‌లు కురిపించారు.

ముఖ్యంగా ఆనంద్ దేవ‌ర‌కొండ‌ లో ఎంతో గొప్ప న‌టుడున్నాడ‌ని మెగాస్టార్ ప్ర‌శంసించారు. అత‌డు బేబి చిత్రం లో ఎంతో ఎమోష‌న‌ల్ న‌ట‌న‌ తో ఆక‌ట్టుకున్నాడ‌ని .. ముక్కోణ ప్రేమ‌క‌థ‌లో ఎక్క‌డా ఎమోష‌న్ ని ఫేస్ లో క‌నిపించ‌నీకుండా లోలోన మ‌ద‌న‌ప‌డే యువ‌కుడి పాత్ర‌లో ఎంతో అద్భుతంగా జీవించాడ‌ని చిరు ప్ర‌శంసించారు.

అంతేకాదు.. ఇదే స‌క్సెస్ వేదిక‌ పై మెగాస్టార్ చిరంజీవి డెబ్యూ న‌టి వైష్ణ‌వి చైత‌న్య‌ను ప్రశంస‌ల్లో ముంచెత్తారు. ఆరోజుల్లో జ‌య‌సుధ స‌హ‌జ‌న‌టిగా అల‌రించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అంత గొప్ప స‌హ‌జ‌న‌టి ని చూప‌డ‌లేదు. చాలా కాలానికి వైష్ణ‌విలో మ‌రో స‌హ‌జ‌న‌టిని చూశాను.. అని చిరు ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాదు బేబి చిత్రం లో వైష్ణ‌వి రెండు గెట‌ప్పుల్లోకి మారిన తీరును ప్ర‌శంసించారు.

ఆరంభం ఒక బ‌స్తీ యువ‌తిలా క‌నిపించిన బేబి కాల‌క్ర‌మం లో ఎవ‌రూ ఊహించ‌నంత గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది. ఆ మేకోవ‌ర్ న‌న్ను ఎంతో ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని చిరంజీవి అన్నారు. అలాగే ఎడిట‌ర్ మార్తాండ్ కె వెంక‌టేష్ వార‌సుడు తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యవుతున్నార‌ని తెలిసి సంతోషించాన‌ని అత‌డు ఎంతో అద్భుతంగా ఇందులో న‌టించాడ‌ని చిరు అన్నారు. ఆనంద్.. వైష్ణ‌విల‌ కు ఎంతో భ‌విష్య‌త్ ఉంద‌ని కూడా వ్యాఖ్యానించారు.

ఇక త‌న అభిమానులైన ఎస్.కె.ఎన్- సాయి ర‌మేష్‌- మారుతి వంటి వారు న‌న్ను స్ఫూర్తిగా తీసుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఈరోజు వారే ఎంద‌రికో స్ఫూర్తిగా నిల‌వ‌డం ఆనందాన్నిస్తోంద‌ని చిరంజీవి అన్నారు. మారుతి నేడు పాన్ ఇండియా స్టార్ (ప్ర‌భాస్)ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడ‌ని ప్ర‌శంసించారు. మ‌రోవైపు మెగా అభిమాన సంఘాల్లో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసిన ఎస్.కె.ఎన్ పెద్ద స్థాయికి ఎద‌గ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. సాయిర‌మేష్ గొప్ప ద‌ర్శ‌కుడిగా ఎదిగాడ‌ని ప్ర‌శంసించారు.