Begin typing your search above and press return to search.

10 ఏళ్ల గ్యాప్ వ‌చ్చినా.. బిగ్గర్ దేన్ బ‌చ్చ‌న్.. రిచెస్ట్ సౌత్ స్టార్!

గత ఐదేళ్లలో ఒక‌ హిట్ మాత్రమే ఉన్నప్పటికీ అతడు ఇప్పుడు సూపర్ స్టార్.

By:  Tupaki Desk   |   30 Jun 2024 3:28 AM GMT
10 ఏళ్ల గ్యాప్ వ‌చ్చినా.. బిగ్గర్ దేన్ బ‌చ్చ‌న్.. రిచెస్ట్ సౌత్ స్టార్!
X

భార‌త‌దేశంలో అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ లాంటి సూప‌ర్ స్టార్లు ఎంద‌రో ఉన్నారు. అయితే వీళ్లంద‌రిలో అమితాబ్ బచ్చన్ ప్రతి చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి బాలీవుడ్ నటుడు అయితే.. అత‌డి కంటే ముందే ఈ ధోరణిని ప్రారంభించిన ఒక హీరో ఉన్నాడు. గత ఐదేళ్లలో ఒక‌ హిట్ మాత్రమే ఉన్నప్పటికీ అతడు ఇప్పుడు సూపర్ స్టార్.

భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఇప్ప‌టికీ వెలుగొందుతున్నారు. అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద పారితోషికం అందుకునే న‌టుడిగాను సుప‌రిచితుడు. నేటికీ అతను ప్రేక్షకుల హృదయాలను శాసిస్తున్నాడు. ప్ర‌పంచవ్యాప్తంగా అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు కూడా. రజనీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, ప్రభాస్, మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ లాంటి సూపర్ స్టార్‌ల కంటే ధనవంతుడు. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ గా సుప్ర‌సిద్ధుడైన‌ చిరంజీవి. ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ‌ను ఏలిన ఈ న‌టుడు ప‌దేళ్ల పాటు గ్యాప్ తీసుకుని మ‌రీ పున‌రారంగేట్రంలో స‌త్తా చాటాడు.

చిరంజీవి 80వ దశకం ప్రారంభంలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి మాస్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌లతో స్టార్‌గా స్థిరపడ్డారు. 90వ దశకంలో బ్యాక్ టు బ్యాక్ సూపర్‌హిట్‌లను అందించి తెలుగు చిత్రసీమలో టాప్ హీరోగా ఎదిగారు. సుప్రీంహీరోగా.. మెగాస్టార్‌గా ఎదిగారు. భార‌త‌దేశంలో బెస్ట్ డ్యాన్స‌ర్ గాను చిరంజీవి పేరు మార్మోగింది.

సెప్టెంబరు 1992లో స్టార్‌డస్ట్ మ్యాగజైన్ చిరంజీవిపై `బిగ్గ‌ర్ దేన్ బచ్చన్` అనే శీర్షికతో కవర్ స్టోరీని ప్రచురించింది. ఇది బోల్డ్ హెడ్డింగ్ కావచ్చు.. అయితే ఆ సమయంలో చిరంజీవి తెలుగు సినిమా `ఆపద్బాంధవుడు` కోసం 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా మారారు. దీనితో ఒకే సినిమాకు రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ సంపాదించిన మొదటి భారతీయ నటుడిగా చిరంజీవి చ‌రిత్ర‌లో నిలిచారు. బాక్సాఫీస్ రారాజు అమితాబ్ బచ్చన్ కూడా అప్పట్లో ఒక్కో సినిమాకు రూ.90 లక్షల లోపే వసూలు చేసేవారు.

ఖైదీ, య‌ముడికి మొగుడు, అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడ‌ర్, రౌడీ అల్లుడు లాంటి మ్యాసివ్ బ్లాక్‌బస్టర్‌లతో చిరు భారీగా అభిమానులను సంపాదించారు. 2008లో రాజ‌కీయాల కోసం సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి తిరిగి తెరపైకి వచ్చినప్పటికీ త‌న‌కు ఫాలోయింగ్ చెక్కు చెద‌ర‌లేద‌ని నిరూపించారు. చిరు ఫ్యాన్ బేస్ ఎప్ప‌టికీ చెక్కు చెద‌ర‌నిది అని నిరూప‌ణ అయింది. అయితే 2019 నుండి ఈ ఐదేళ్ల‌లో ఒకే ఒక్క హిట్ చిత్రం మాత్ర‌మే ఉంది. వాల్తేరు వీరయ్య మిన‌హా స‌రైన విజ‌యాలు లేవు.

అయితే సౌత్ ఇండియాలో అక్కినేని నాగార్జున తర్వాత అత్యంత ధనవంతుడు చిరంజీవి. నాగార్జున నిక‌ర ఆస్తులు దాదాపు 3000 కోట్లు. మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. చిరంజీవి నికర ఆస్తుల‌ విలువ రూ.1650 కోట్లు. రజనీకాంత్ (రూ. 430 కోట్లు), కమల్ హాసన్ (రూ. 450 కోట్లు), రామ్ చరణ్ (రూ. 1350 కోట్లు), ప్రభాస్ (రూ. 240 కోట్లు) కంటే ధనవంతులుగా నిలిచారు. మెగాస్టార్ సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్, కుమారుడు రామ్ చరణ్ సౌతిండియాలో అగ్ర క‌థానాయ‌కులుగా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లుగా సుప‌రిచితులు.