Begin typing your search above and press return to search.

చిరు.. రూపాయి కూడా తీసుకోలేదు కానీ..

అవును మీరు చదివింది నిజమే. ఎందుకంటే ఈ సినిమా విడుదలై మంచి లాభాలను తీసుకొస్తే.. అందులో చిరంజీవి వాటా తీసుంటారట.

By:  Tupaki Desk   |   28 July 2023 7:07 AM GMT
చిరు.. రూపాయి కూడా తీసుకోలేదు కానీ..
X

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానుల్లో పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఆయన అలా ఒక్క డైలాగ్ చెప్పి, ఓ స్టెప్ వేస్తే థియేటర్ దద్దరిల్లిపోతది. మరి అలాంటి హైరేంజ్ స్టార్ హీరో ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

మరి ఆయన తాజాగా నటించిన భోళా శంకర్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిరు ఈ సినిమాకు తీసుకున్న పారితోషికం గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇప్పుడందరూ దాని గురించే మాట్లాడేసుకుంటున్నారు. వార్త తెలుసుకుంటున్న వారు మొదట షాక్ అయిపోతున్నారు. ఆ తర్వాత అసలు విషయం ఏంటో అర్థం చేసుకుంటున్నారు.

ఇంతకీ ఈ సినిమా కోసం చిరు.. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ గా తీసుకోలేదట. అవును మీరు చదివింది నిజమే. ఎందుకంటే ఈ సినిమా విడుదలై మంచి లాభాలను తీసుకొస్తే.. అందులో చిరంజీవి వాటా తీసుంటారట. ప్రస్తుంత ఈ వార్తే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే చిరు నటించిన లాస్ట్ రెండు చిత్రాలు 'గాడ్‌ఫాదర్', 'వాల్తేర్ వీరయ్య' సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో 'భోళా శంకర్' కు మంచి డిమాండ్ నెలకొంది. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు విక్రయించారట. అలాగే ఓటీటీ రైట్స్ కు కూడా మంచి బిజినెస్ జరిగిందట. మేకర్స్ బాగానే వెనకేసుకున్నారట.

ఇక ఈ చిత్రం రిలీజై లాభాల్లోకి వెళ్లగానే.. చిరంజీవి అందులో తనకు కావాల్సిన మొత్తం తీసుకుంటారట. చూడాలి మరి ఈ సినిమా ఎంత లాభాలను తీసుకువస్తుందో. ఇకపోతే భోళా శంకర్ చిత్రాన్ని అనిల్ సుంకర, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా కలిసి నిర్మించాయి. మెహర్ రమేశ్ దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టి ఈ చిత్రాన్ని డైరెక్టర్ చేశారు. ఈ సినిమాతో చిరు హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఉన్నారు.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులకు కావాల్సి అన్ని మాస్ ఎలిమెంట్స్ ను ఇందులో చూపించారు. చిత్రంలో తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్ కూడా నటించారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.