Begin typing your search above and press return to search.

జన్మదినోత్సవానికి ముందు చిరు ఎక్కడకు వెళ్తున్నారో తెలుసా?

డ్యాన్స్ లకే డ్యాన్స్ నేర్పి.. ఫైట్ లంటే ఎలా ఉంటాయో చూపి.. తెలుగు సినిమా చరిత్రలో లెజెండ్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.

By:  Tupaki Desk   |   21 Aug 2024 7:02 AM GMT
జన్మదినోత్సవానికి ముందు చిరు ఎక్కడకు వెళ్తున్నారో తెలుసా?
X

డ్యాన్స్ లకే డ్యాన్స్ నేర్పి.. ఫైట్ లంటే ఎలా ఉంటాయో చూపి.. తెలుగు సినిమా చరిత్రలో లెజెండ్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. 45 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని.. 70 వ ఏట అడుగు పెడుతున్న ఆయన జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాండ్ నుంచి చిత్తూరు జిల్లాలోని చివరాఖరి పల్లె వరకు మెగాస్టార్ పుట్టిన రోజును పండుగలా జరుపుకోవడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ఏడాది చిరంజీవి జన్మదినానికి మరింత ప్రత్యేకత ఉంది. ఆయన భారత దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు.. చిన్న తమ్ముడు, జన సేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పెద తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా నిర్మాతగా హిట్ కొట్టారు. అందుకే 2024 సంవత్సరం చిరంజీవి అత్యంత అపురూపంగా మారిపోయింది.

టూర్ లు చేయడంలోనూ మెగాస్టారే

కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే చిరంజీవి తరచూ టూర్లు చేస్తుంటారు. 2004 నుంచి ఆయన క్రమం తప్పకుండా ఒలింపిక్స్ కు హాజరవుతున్నారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ కు కూడా వెళ్లొచ్చారు. ఇక అదే సమయంలో లండన్ కూడా వెళ్లారు. భార్య సురేఖ, కుమారుడు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారాతో కలిసి ఆయన లండన్ లో కనిపించారు. సినిమా షూటింగ్ లలో భాగంగా విదేశాలకు వెళ్లడమే కాక.. వ్యక్తిగతంగా కుటుంబంతోనూ వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా, ఇప్పుడు జన్మదినోత్సవాన ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో గడపనున్నారు.

తనను గెలిపించిన చోటకు..

గురువారం మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. ఏ వ్యక్తికైనా జన్మదినం అంటే ప్రత్యేకమే. మరి అలాంటి మెగాస్టార్ కు మరింత ప్రత్యేకం కాకుండా ఎందుకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 70వ పడిలోకి అడుగుపెడుతున్న చిరంజీవి ఆ రోజు ఎక్కడకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సమధానం తిరుపతి. అవును బుధవారం చిరంజీవి కుటుంబ సమేతంగా ప్రసిద్ధ పుణ్య క్షేతం తిరుపతికి వెళ్లారు. గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోనున్నారు. కాగా, 2009 ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. చిరు పుట్టిన జిల్లా పశ్చిమ గోదావరిలోని పాలకొల్లులో ఓటమి పాలైనప్పటికీ తిరుపతి ప్రజలు ఆయనను గెలిపించారు.