Begin typing your search above and press return to search.

మెగాస్టార్.. సర్ ప్రైజ్ సిద్ధమా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది

By:  Tupaki Desk   |   15 Aug 2024 4:30 PM GMT
మెగాస్టార్.. సర్ ప్రైజ్ సిద్ధమా?
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 150 కోట్ల వరకు ఈ చిత్రంపై పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో విశ్వంభర మూవీ కథ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది.

మరో నలుగురు అందాల భామలు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రాబోతోంది. బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కి విశ్వంభర సినిమా నుంచి అదిరిపోయే రేంజ్ లో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టీజర్ తో విశ్వంభర సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉందంట.

మరో వైపు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మరో మెగా సర్ప్రైజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. మెగాస్టార్ కూతురు సుస్మిత కొణెదల బ్యానర్ లో చిరంజీవి ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. అయితే గతంలో ఓ మూవీని సుస్మిత బ్యానర్ లో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల ఇంపాక్ట్ తో రీమేక్ ఆలోచన పక్కన పెట్టి ఒరిజినల్ కథతోనే సినిమా చేయాలని చిరంజీవి రెడీ అయ్యారు.

మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుందనే టాక్ వచ్చింది. బివిఎస్ రవి అదిరిపోయే స్టోరీ లైన్ ని ఇప్పటికే చిరంజీవికి వినిపించారంట. ఈ కథ ఫైనల్ డ్రాఫ్ట్ ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారంట. ఒకవేళ ఈ స్క్రిప్ట్ ఒకే అయితే సినిమాకి సంబందించిన అప్డేట్ ని ఆగష్టు 22న ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మోహన్ రాజా టీమ్ ఈ స్కిప్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారంట. గాడ్ ఫాదర్ తో చిరంజీవికి మోహన్ రాజా సక్సెస్ ఇవ్వలేకపోయారు.

అయితే నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ తో మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఒక వేళ ఈ మూవీ స్క్రిప్ట్ లాక్ కాకుంటే కేవలం విశ్వంభర అప్డేట్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందంట. ఇంద్ర మూవీ 4K వెర్షన్ ని చిరంజీవి బర్త్ డే కానుకగా రీరిలీజ్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.