చిరంజీవితో వివాదం యండమూరి వివరణ!
ఆ తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి-యండమూరి ఇటీవలే ఓ వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Feb 2024 8:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి- ప్రఖ్యాత రచయిత యండమూరి విరేంద్రనాధ్ మధ్య అప్పట్లో వివాదాలున్నట్లు మీడి యాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు యండమూరిపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. పబ్లిక్ గానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. యండమూరి అని పేరు పెట్టకుండా నాగబాబు విమర్శలు గప్పించారు. అప్పట్లో అది పెద్ద సంచలనమే అయింది. ఆ తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి-యండమూరి ఇటీవలే ఓ వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే.
ఆ వేదిక సాక్షిగానే చిరంజీవి జీవిత కథని రాసే అవకాశం యండమూరికి కల్పించినట్లు చిరు ప్రకటిం చారు. ఇద్దరి మధ్య అంత గొడవైన తర్వాత జీవిత కథని రాసే అవకాశం మళ్లీ ఆయనకి ఇవ్వడం ఏంటి? అని మాత్రం విమర్శలు తెరపైకి రాలేదనుకోండి. ఎందుకంటే నేడు చిరంజీవి ఆస్థానంలో ఉన్నా రంటే? కారణం యండమూరి అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఆయన అందించిన కథలతోనే శివశంకర వర ప్రసాద్..మెగాస్టార్ అయ్యారు. ఆ బిరుదు కూడా యండమూరి అందించిందే.
తాజాగా చిరంజీవి జీవిత కథని రాయడానికి యండమూరి స్వయంగా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. యండ మూరి చొరవతోనే చిరంజీవి ఆ అవకాశం ఆయనకు ఇచ్చినట్లు యండమూరి రివీల్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యాన్ని యండమూరి గుర్తు చేసుకున్నారు.`మంచుపల్లకి` సినిమాకి నేను డైలాగ్స్ రాశాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక విభేదాలు భార్యాభర్తల మధ్య కూడా వస్తుంటాయి . అలాంటివి వస్తూనే ఉంటాయి.
ఆ తరువాత కలిసిపోతూనే ఉంటాము. నాలుగేళ్ల తరువాత చిరంజీవి ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏమోనని నేను కాస్త భయపడ్డాను. కానీ ఆయన కళ్లలో అదే ప్రేమ కనిపించింది. ఆ రోజున ఆ వేదికపై నేనే అన్నాను మీ జీవిత చరిత్రను రాస్తే బాగుంటుందేమో అని. ఆయన ఆనందాశ్చర్యాలకు లోనవుతూ 'నిజంగా రాస్తారా .. నువ్వు రాస్తే అంతకంటే కావలసిందేముంటుంది? ఈ స్టేజ్ పై ఎనౌన్స్ చేయనా? అని అన్నారు. అలా అక్కడ ఆ ప్రకటన చేయడం జరిగింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు` అని యండమూరి వివరణ ఇచ్చారు.