Begin typing your search above and press return to search.

నా విజ‌యాల్లో సింహ‌భాగం యండ‌మూరిదే! చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి త‌న జీవిత చ‌రిత్ర‌ను పుస్త‌కంగా రాసే అవకాశం ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాద్ కి అప్ప‌గించారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 10:28 AM GMT
నా విజ‌యాల్లో సింహ‌భాగం యండ‌మూరిదే! చిరంజీవి
X

మెగాస్టార్ చిరంజీవి త‌న జీవిత చ‌రిత్ర‌ను పుస్త‌కంగా రాసే అవకాశం ప్ర‌ముఖ ర‌చ‌యిత యండ‌మూరి వీరేంద్ర‌నాద్ కి అప్ప‌గించారు. ఈ విష‌యాన్ని చిరంజీవిస్వ‌యంగా వెల్ల‌డించారు. లోక్ నాయ‌క్ పౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో వైజాగ్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో భాగంగా చిరంజీవి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఎన్టీఆర్ 28వ పుణ్య‌తిది-ఏఎన్నార్ శ‌త జ‌యంతి కార్య‌క్ర‌మం వైజాగ్ లో జ‌రిగింది. దీనికి మెగాస్టార్ ముఖ్య అతిధిగా హాజ‌రు కాగా....యండ‌మూరి స‌త్కార హోదాలో హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా యండ‌మూరిని ఆచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ త‌దిత‌రుల‌తో క‌లిసి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా యండ‌మూరిని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. `నేను స్టార్ గా ఎద‌గ‌డానికి యండ మూ రి ర‌చ‌న‌లే కార‌ణం. ఆయ‌న మేథో సంప‌త్తి నుంచి వ‌చ్చిన పాత్ర‌లే నా కెరీర్ కి సోపానాల‌య్యాయి. ఆయ‌న సినిమాలోత‌నే నాకు మెగాస్టార్అ నే బిరుదు వ‌చ్చింది. అభిలాష న‌వ‌ల గురించి నాకు మొద‌ట మా అమ్మ చెప్పింది.

అదే న‌వ‌ల ఆధారంగా కె.ఎస్ రామారావు గారు న‌న్ను హీరోగా పెట్టి సినిమా తీసారు. కోదండ‌రా మిరెడ్డి ద‌ర్శ‌క త్వం..ఇళ‌య‌రాజా పాట‌లు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కెరీర్ లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఛాలెంజ్ ఎంతో మంది యువ‌త‌ని ప్ర‌భావితం చేసింది. నా సినిమా విజ‌యాల్లో సింహ‌భా గం యండ‌మూరి ర‌చ‌న‌ల‌దే. ఆయ‌న నా జీవిత చ‌రిత్ర రాస్తాను అన‌డం నిజంగా సంతోషంగా ఉంది` అని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి - యండ‌మూరి విరేంద్రనాద్ న‌వ‌ల హీరో అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న ర‌చించిన న‌వ‌ల‌ల ఆధారంగానే చిరు ఎన్నో సినిమాలు చేసారు. చిరంజీవిని మెగాస్టార్ గా మార్చింది ఆయ‌న న‌వ‌ల‌లే. అందుకే మెగాస్టార్ అనే బిరుదును స్వ‌యంగా చిరంజీవికి యండ‌మూరి ఇచ్చారు. `అభిలాష‌`..`ఛాలెంజ్`..`మ‌ర‌ణ మృదంగం`..`రాక్ష‌సుడు` లాంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ ఆ కాంబినేష‌న్ లోనే సాధ్య‌మైంది. యండ‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి `స్టువ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్` అనే సినిమా కూడా చేసిన సంగ‌తి తెలిసిందే.