Begin typing your search above and press return to search.

మెగా ప్రేమ్ ఈసారి మ‌రింత అందంగా !

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఒకే ప్రేమ్ లో క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి అవ‌దులుండ‌వ్.

By:  Tupaki Desk   |   10 May 2024 6:38 AM GMT
మెగా ప్రేమ్ ఈసారి మ‌రింత అందంగా !
X

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఒకే ప్రేమ్ లో క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి అవ‌దులుండ‌వ్. అభిమాన తార‌ల‌తో పాటు కెమెరా ముందుకు రాని ఇత‌ర కుటుంబ స‌భ్యులు కూడా ప్రేమ్ లో భాగ‌మైతే మ‌రింత అందంగా ఆ ప్రేమ్ క‌నిపిస్తుంది. ఇది చాలా రేర్ గా చోటు చేసుకునే స‌న్నివేశం. ఏటా మెగా-అల్లు ఫ్యామిలీలు రెండు క‌లిసి సంక్రాంతి పండ‌గును ఎంతో ఘ‌నంగా బెంగుళూరు చిరు ఫామ్ హౌస్ లో చేసుకుంటారు.

ఆ పండుగ స‌మ‌యంలో ఏ ఒక్కరు మిస్ కారు. దాదాపు అంద‌రూ హాజ‌ర‌వుతారు. ఇక చిరంజీవి-సురేఖ కూడా ఈ మ‌ధ్య కాలంలో జంట‌గా చాలా సంద‌ర్భాల్లో క‌నిపిస్తున్నారు. వెకేష‌న్ల‌కు వెళ్ల‌డంతో ఎయిర్ పోర్టులో చిక్క‌డం..వెకేష‌న్ ఫోటోలు షేర్ చేయ‌డంతో అభిమానుల్లో నూత‌నొత్సాహం క‌నిపిస్తుంది. అలాగే చిరంజీవి-చ‌ర‌ణ్ కూడా సినిమా ఈవెంట్ల‌లో క‌నిపిస్తుంటారు. కానీ స‌తీమ‌ణుల‌తో మాత్రం పెద్ద‌గా క‌నిపించారు.

తాజాగా నిన్న‌టి రోజున ఆ స‌న్నివేశం చోటుచేసుకుంది. చిరంజీవికి ప‌ద్మ‌విభ‌ష‌ణ్ అవార్డు అందుకోవ‌డం కోసం ఆ కుటుంబం చ‌ర‌ణ్ దంప‌తులు..చిరంజీవి దంప‌తులు..కుమార్తెలు కూడా ఢిల్లీ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ మాత్రం అరుదైన ఘ‌ట్టం చోటు చేసుకుంది. రెడ్ కార్పెట్ పై అంతా క‌లిసి దిగిన ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. చిరంజీవి-సురేఖ‌..కుమార్తు సుస్మిత‌, చ‌ర‌ణ్ -ఉపాస‌న అంతా క‌లిసి ఫోటోకి ఫోజు ఇచ్చారు.

ఇదిగో ఇక్క‌డ ఆ ఫోటోని చూడొచ్చు. చిరంజీవి బ్లూ క‌ల‌ర్ స‌ఫారీ డ్రెస్ ధ‌రించ‌గా...సురేఖ సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో ఉన్నారు. ప‌క్క‌నే ఉన్న సుస్మిత కూడా చీరందంలో మెరిసారు. చ‌ర‌ణ్ బ్లాక్ క‌ల‌ర్ దుస్తులు ధ‌రించ‌గా..ఉపాస‌న మాత్రం ప్లోర‌ల్ దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబ‌య్యారు. ఇలా ఐదుగురితో కూడిన ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆ రెండు జోడీల్ని చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వ‌నిపిస్తుంది. అంత అందంగా ప్రేమ్ క‌నిపిస్తుంది.