Begin typing your search above and press return to search.

తాత‌య్య ఒడిలో క్లీంకార ముద్దు ముద్దుగా!

మెగాస్టార్ చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్ ఎంతో సంతోషంగా సాగిపోతుంది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 6:11 AM GMT
తాత‌య్య ఒడిలో క్లీంకార ముద్దు ముద్దుగా!
X

మెగాస్టార్ చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్ ఎంతో సంతోషంగా సాగిపోతుంది. రాజ‌కీయాల నుంచి నిష్ర‌మించిన త‌ర్వాత తాను మొద‌టిగా ఇష్ట‌ప‌డిన రంగం వైపే మ‌ళ్లీ వెళ్లి సినిమాలు చేసుకుంటున్నారు. త‌న‌ని అభిమాన స్టార్ గా ప్రేక్ష‌కాభిమానులు అల‌రించాల‌ని భావించి చిరు సెకెండ్ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక కుటుంబంలో పెద్ద‌గా త‌న‌వంతు బాధ్య‌త‌ల్ని సైతం అన్నింటిని నెర‌వేర్చేసారు. కుమారుడు ..కుమార్తె ల‌కు పెళ్లిళ్లు చేసేసారు. మ‌న‌వ‌రాళ్లు...మ‌న‌వ‌ళ్ల‌తోనూ ఎంతో సంతోషంగా గ‌డుపుతున్నారు.


ఇప్పుడాయ‌న కాల‌క్షేప‌మంతా మ‌న‌వ‌లే. ఇంత‌కన్నా ఈ జీవితానికి కావాల్సింది ఇంకేముందు అంటూ ఎంతో సంతోషంగా క‌నిపిస్తున్నారు. ఇక రిప‌బ్లిక్ డేని పుర‌స్క‌రించుకుని దేశ అత్యున్న‌త రెండ‌వ పౌర పుర‌స్కారం ప‌ద్మ‌వి భూష‌ణ్ కూడా వ‌రించింది. ఈ అవార్డుల ప‌ట్ల ఆయ‌న ఎంతో సంతోషంగా ఉన్నారో తెలి సిందే. తాను ఊహించ‌న‌ది జ‌రిగింది అంటూ ఎంతో ఆనందం వ్య‌క్తం చేసారు. ఇక సినిమా షూటింగ్ లు లేక‌పోతే చిరంజీవి ఇంట్లో ఎలా ఉంటారో తెలిసిందే. కొంత స‌మ‌యాన్ని కిచెన్ రూమ‌లో పాస్ చేస్తారు.

మ‌రికొంత స‌మ‌యాన్ని మ‌న‌వ‌ల‌తో ఆడుకోవాడ‌నికి కేటాయిస్తారు. తాజాగా మ‌న‌వ‌రాళ్ల‌తో క‌లిసి దిగిన ఓ ప్ర‌త్యేక ఫోటోని కోడలు ఉపాస‌న ఇన్ స్టాలో షేర్ చేసారు. అందులో పెద్ద కుమార్తెఓ సుష్మిత ఇద్దరు పిల్లలు.. చిన్న కుమార్తె శ్రీజ ఇద్దరు పిల్లలతో పాటు రామ్ చరణ్ స్వీట్ డాట‌ర్ క్లింకారా కూడా ఉంది. అంద‌రిలో పాపాయి క్లీంకార. దీంతో గారాల మ‌న‌వ‌రాల్ని చిరు ఒడిలో కుర్చోబెట్టుకుని ఆడిస్తున్నారు.

ఆ స‌మ‌యంలో అంద‌రితో పాలు క‌లిసిదిగిన ఫోటో ఇది. అయితే క్లీంకార ముఖాన్ని మాత్రం బ్ల‌ర్ చేసారు. క్లీంకార ఎవ‌రి పోలిక‌ల‌తో ఉంది? అన్న‌ది ఇంకా తెలియ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ పాపాయి ఫోటోని ఎక్క‌డా లీక్ చేయ‌లేదు. మంచి ముహూర్తం చూసి అభిమానుల‌కు క్లీంకార‌ని ప‌రిచ‌యం చేస్తారు. ఇందులో క్లీంకార ఎంతో ముద్దుగా ఉంది. ఎరుపు రంగు గౌను వేసుకుని తాత‌య్య ఒడిలో కూర్చుని పాపాయి చిరున‌వ్వులు చిందిస్తుంది.