చందమామ పై ఓ ఇల్లు చిరు..కమల్ కూడా ఆశ పడుతున్నారా?
చంద్రయాన్ -3 సక్సెస్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి..విశ్వనటుడు కమల్ హాసన్ కామెంట్లో 'చంద్రుడికి ఇంకెంతో దూరంలోలేము..
By: Tupaki Desk | 29 Aug 2023 11:37 AM GMT'చంద్రయాన్-3' సక్సెస్ తో సౌత్ సెలబ్రిటీల్లో కొత్త కోర్కెలు పుడుతున్నాయా? భూగ్రహం మీద బోర్ కొట్టిన జనాలు చంద్రగ్రహం మీద అవాసాల ఏర్పాటపై ఆశపడుతున్నారా? జీవన విధానంలో మార్పులు కోరుకుంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. చంద్రయాన్ -3 సక్సెస్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి..విశ్వనటుడు కమల్ హాసన్ కామెంట్లో 'చంద్రుడికి ఇంకెంతో దూరంలోలేము..చంద్రుడిపై అడుగు పెట్టడానికి ఇంకెంతో సమయం పట్టదు అన్నట్లు అభిప్రాయపడ్డారు.
వాళ్ల మనసుల్లోతులోంచి ఎంతో ఉద్విగ్నంగా వచ్చిన మాటలివి. వాటి గురించి విశ్లేషిస్తే ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా చంద్రమండలంపై ఆవాసానికి ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. అందమైన చందమామపై ఓ ఇల్లు కట్టుకుని..మచందమామ రావే..జాబిల్లి రావే అనే పాటకు బధులుగా..చందమామ మీదకు మేమే వచ్చాం...జాబిల్లి మీదకొచ్చి జాజిపూలు మేమే తెచ్చాం! అనేలా ఆ నాటి పాట తీరునే మార్చేలా ఆశ పడుతున్నారు. సమాజానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం. మానవాళి మనుగడకు ఆవాసయోగ్యమైందని రుజువైతే! ఆ ఇద్దరు అక్కడా ఇల్లు కట్టుకోవడం ఖాయమే.
ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు షారుక్ ఖాన్...సుషాంత్ రాజ్ పుత్ లకు అక్కడ స్థలాలు జాబిల్లిపై స్థలాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఒక అభిమాని పుట్టినరోజు సందర్భంగా ఏటా తన పేరుపై కొంత భూమి కొనుగోలు చేస్తున్న విషయాన్ని షారుక్ చాలా సందర్భాల్లో వెల్లడించారు.
ఏటా తనకి లూనా సొసైటీ ఇంటర్నేషనల్ నుంచి సంబంధిత సర్టిఫికెట్లు వస్తాయని చెప్పారు. అలాగే దివంగత నటుడు శుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా స్పేస్ మీద ఉన్న మక్కువతో చంద్రుడిపై ముస్కోవియన్స్ అని పిలిచే ప్రాంతంలో రూ.55 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.
జూన్ 25- 2018న ఆ ప్రాంతాన్ని అతని పేరుపై రిజిస్టర్ కూడా చేయించుకున్నాడు. ఇంకా జోద్ పూర్ ఎయిమ్స్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ తన ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమి కొన్నారు. లూనా ఇంటర్నేషనల్ ఇచ్చిన సర్టిఫికేట్లను కూడా చూపించారు. అజ్మీర్ ధర్మేంద్ర అనిజా పెళ్లిరోజు సందర్భంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రుడిపై 3 ఎకరాల భూమిని బహూకరించారు.
వీళ్లంతా ముందుగానే చంద్రుడిపై స్థలాలు కొని పెట్టారు. 2030 కల్లా చంద్రమండలంపై అంతా అనుకూలంగా ఉంటుందా? లేదా? అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత అక్కడా రియల్ వెంచర్లు మొదలైపోతాయి.