Begin typing your search above and press return to search.

'మెగా 156'.. చురకత్తుల్లాంటి చూపులతో అఫీషియల్!

చిరంజీవి తన 156వ సినిమాను తన కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డెన్ బాక్స్​ ఎంటర్​టైన్మెంట్స్​లో చేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:05 AM GMT
మెగా 156..  చురకత్తుల్లాంటి చూపులతో అఫీషియల్!
X

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే పూనకాలు వస్తాయి. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్లు దద్దరిల్లుతాయి. అయితే రీసెంట్​గా ఆయన 'భోళాశంకర్'​తో భారీ డిజాస్టర్​ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇక తన కొత్త సినిమాలపై ఫోకస్​ పెట్టారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడాయన కొత్త సినిమా అనౌన్స్​మెంట్​ ఇచ్చి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చారు మేకర్స్​


చిరంజీవి తన 156వ సినిమాను తన కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డెన్ బాక్స్​ ఎంటర్​టైన్మెంట్స్​లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రాన్నే అధికారికంగా ప్రకటించారు. 4 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ, లక్షలాది మందికి భావోద్వేగాలను కలిగించే వ్యక్తిత్వం, తెర ముందూ, తెరవెనకా ఒకేలా పిలవబడే వ్యక్తి.. అంటూ చిరు గొప్పతన్నాన్ని రాసుకొచ్చారు.

అలాగే ఓ డస్క్రీ కలర్​లో ఉన్న కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి తన మీసాలను పదునుగా చేస్తూ చురకత్తులాంటి చూపులతో గంభీరంగా చూస్తూ కనిపించారు. ఇంకా ఈ పోస్టర్​ బ్యాక్​గ్రౌండ్​లో ఆయన నటించిన గత సినిమాల పేర్లన్నీ కనిపించడం విశేషం. 155 సినిమాల తర్వాత రాబోతున్న ఈ చిత్రం మెగా రాకింగ్​గా ఉండనుందని తెలిపింది.

అయితే ఈ చిత్ర వివరాలను ఏమీ తెలుపలేదు. ఈ చిత్రానికి బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. మలయాళ సూపర్​ హిట్ సినిమా బ్రో డ్యాడీ రీమేక్​గా ఇది రానుంది. మల్టీస్టారర్​గా రానున్న ఈ చిత్రంలో యంగ్ హీరో శర్వానంద్​ నటించబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. కథను కాస్త తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్చి రూపొందించనున్నారట.

అయితే ఈ మూవీ ఒరిజినల్​ వెర్షన్​లో మోహన్​ లాల్​-పృథ్వీరాజ్ సుకుమార్​ తండ్రీ కొడుకులుగా నటించారు. కానీ ఇక్కడ మాత్రం తండ్రీకొడుకుల థీమ్‌ చూపించట్లేదని తెలిసింది. బ్రదర్ కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందించేలా పాత్రలను డిజైన్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెగా 157ను బింబిసార దర్శకుడు విశిష్ఠతో సోషియో ఫాంటసీగా చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.