Begin typing your search above and press return to search.

దశబ్దాల తర్వాత మెగా ఫాంటసీ.. ఇంట్రెస్టింగ్​గా పోస్టర్​

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి

By:  Tupaki Desk   |   22 Aug 2023 7:10 AM GMT
దశబ్దాల తర్వాత మెగా ఫాంటసీ.. ఇంట్రెస్టింగ్​గా పోస్టర్​
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగానే యూవీ క్రియేషన్స్‌.. తమ బ్యానర్‌పై చిరంజీవి 157వ సినిమాను అఫీషియల్​గా ప్రకటించింది. 'మెగా స్టార్ అనే శక్తి కోసం నిప్పు, నీరు, ఆకాశం, భూమి, వాయువు అనే పంచభూతాలు కలుస్తున్నాయి. ఈ సారి మెగామాస్​ యూనివర్స్​ను మించి ఉండబోతుందని' అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చింది.


క్యాప్షన్​కు తగ్గట్టే పోస్టర్​ను కూడా ఇంట్రెస్టింగ్​గా డిజైన్ చేశారు. పోస్టర్​ను చూస్తుంటే ఇది సోషియో ఫాంటసీ మూవీ అని అర్థమవుతోంది. అంటే దశాబ్దాల తర్వాత చిరు మళ్లీ ఇలాంటి కథలో రానున్నారు. గతంలో చిరు ప్రధాన పాత్రలో సోషియో ఫాంటసీ వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సూపర్ హిట్​గా నిలిచింది. ఆ తర్వాత పంచభూతాల నేపథ్యంలోనే వచ్చి 'అంజి' పర్వాలేదనిపించింది.

అయితే అప్పటి నుంచి మళ్లీ చిరు ఇలాంటి సోషియో ఫాంటసీ సినిమా చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు ఫైనల్​గా మెగా 157 రూపంలో ఫ్యాన్స్ కల తీరబోతోంది. మరి వశిష్ట ఎలాంటి విజువల్ వండర్ అందిస్తారో చూడాలి. ఇక పోస్టర్ విషయానికొస్తే.. ఓ పెద్ద శిల మీద బంగారు నక్షత్రం గుర్తుపై ఉన్న గళ్లలో.. నిప్పు, నీరు, ఆకాశం, భూమి, వాయువు.. పంచభూతాలతో నింపుతూ మధ్యలో త్రిశూలాన్ని పొందుపరిచి చూపించారు. ఇది చూస్తుంటే భారీ ప్లానింగ్​తోనే వస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే ఇది కాన్సెప్ట్ పోస్టర్​ కాబట్టి.. ఎక్కువగా ఏమీ ఇతర వివరాలు రివీల్ చేయలేదు. ఇప్పటికీ ప్రచారంలో సంగీత దర్శకుడు కీరవాణి, కెమెరామెన్ చోటా కె నాయుడులతో సహా ఎవరినీ పేర్లను కూడా ఇందులో చెప్పలేదు. సినిమాకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. ఆచితూచి సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరిని పరిచయం చేసే అవకాశం ఉంది.

యూవీ క్రియేషన్స్​ అప్డేట్​తో పాటు గోల్డెన్ బాక్స్​ ఎంటర్​టైన్మెంట్స్​ నిర్మిస్తున్న మెగా 156 అప్డేట్​ కూడా వచ్చింది. '4 దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న లెగసీ, లక్షలాది మందికి భావోద్వేగాలను కలిగించే వ్యక్తిత్వం, తెర ముందూ, తెరవెనకా ఒకేలా పిలవబడే వ్యక్తి..' అని రాసుకొచ్చి ఓ స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేశారు. 155 సినిమాల తర్వాత రాబోతున్న ఈ సినిమా మెగా రాకింగ్​గా ఉండనుందని పేర్కొంది. బంగార్రాజు ఫేమ్​ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో.. మలయాళ సూపర్ హిట్ చిత్రం బ్రో డ్యాడీకి రీమ్​క్​గా ఈ చిత్రం రానుంది.