Begin typing your search above and press return to search.

మెగాడాట‌ర్‌తో మాస్ డైరెక్ట‌ర్.. హీరో ఎవ‌రో?

సీనియ‌ర్లలో మెగాస్టార్ చిరంజీవి దూకుడు గురించి తెలిసిందే. 60ప్ల‌స్ లోను యువ‌హీరోలను ఆయ‌న డామినేట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 March 2024 10:53 AM GMT
మెగాడాట‌ర్‌తో మాస్ డైరెక్ట‌ర్.. హీరో ఎవ‌రో?
X

సీనియ‌ర్లలో మెగాస్టార్ చిరంజీవి దూకుడు గురించి తెలిసిందే. 60ప్ల‌స్ లోను యువ‌హీరోలను ఆయ‌న డామినేట్ చేస్తున్నారు. ఏజ్ ఒక నంబ‌ర్ మాత్ర‌మేనని నిరూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తున్నారు. ఖైదీనంబ‌ర్ 150 త‌ర్వాత ఏకంగా అర‌డ‌జ‌ను పైగానే సినిమాల్లో న‌టించిన మెగాస్టార్ ఇప్పుడు వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభ‌ర‌` (MEGA 157 ) షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా 10 జనవరి 2025న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దీని త‌ర్వాత చిరు వ‌రుస‌గా ద‌ర్శ‌కుల‌ను క్యూలో ఉంచార‌ని స‌మాచారం. ఇందులో కొంత సీనియ‌ర్ అయిన హ‌రీష్ శంక‌ర్ తో ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంత‌కుముందు బోయ‌పాటితో ఛాన్సుంద‌ని ప్ర‌చార‌మైనా కానీ అది ఎందుక‌నో సెట్ట‌వ్వ‌లేదు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ తో సినిమా(MEGA 157)ని ఏడాది చివ‌రిలో ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రానికి బివిఎస్ రవి కథను అందించారు. చిరంజీవి ఈ ప్రాజెక్ట్‌కు అధికారికంగా అనుమతినిచ్చార‌ని టాక్ వినిపిస్తోంది.

మాస్ డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ ర‌చ‌యిత‌ల‌ బృందం ఇప్పటికే స్క్రిప్ట్‌పై పని చేస్తోంది. అయితే ఈ క‌థాంశం ఎలా ఉండ‌నుంది? అన్న‌దానికి కూడా ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది హ‌రీష్ మార్క్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర‌హాలో ఆద్యంతం న‌వ్విస్తూనే, ఘ‌రానామొగుడు త‌ర‌హాలో టింజ్ తో ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో క‌ట్టి ప‌డేస్తుంద‌ని, ఇందులో సామాజిక సందేశాన్ని అందిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చిరు బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ మూవ్‌మెంట్స్, ఫైట్స్ వేటిలోను త‌గ్గ‌కుండా స్క్రిప్టులో లోటుపాట్లు లేకుండా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దుతున్నార‌ని తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సుస్మిత కొణిదెల ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించనున్నారు. ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తో బిజీగా ఉన్న హ‌రీష్ శంక‌ర్ కి ఈ రెండు మూడు నెల‌ల్లో మెగా 158 స్క్రిప్టుపై పూర్తి క్లారిటీ రానుంది. ఈలోగానే హ‌రీష్ శంక‌ర్ త‌ర్వాత తాను న‌టించే సినిమాల క‌థ‌ల‌ను చిరు ఫైన‌లైజ్ చేస్తార‌ని తెలుస్తోంది.