చిరు నెక్స్ట్ ప్లాన్ ఏంటో?.. లైనప్‌లోకి సీనియర్ దర్శకుడు
సోషల్‌మీడియాలో ఇప్పుడంతా ఎక్కడా చూసిన మెగాస్టార్ చిరంజీవి గురించే చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 13 Aug 2023 2:33 PM GMTసోషల్‌మీడియాలో ఇప్పుడంతా ఎక్కడా చూసిన మెగాస్టార్ చిరంజీవి గురించే చర్చ సాగుతోంది. 'భోళాశంకర్' భారీ డిజాస్టర్ అందుకోవడంతో ఈ చర్చలు ఎక్కువైపోయాయి. నెక్ట్స్ చిరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో? ఏ డైరెక్టర్‌తో వస్తారో? కథలు, పాత్రల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో? అంటూ ప్రతిఒక్క సినీ అభిమాని తెగ చర్చించుకుంటున్నారు.
అయితే ఈ భోళాశంకర్ సినిమా తర్వాత చిరు తన కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. మలయాళ హిట్ సినిమా బ్రో డ్యాడీ రీమేక్‌గా రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత చిరు ఏ దర్శకుడితో చేయబోనున్నారనే విషయంపై పలు రకాల వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
పలు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు వివి వినాయక్ పేరు గట్టిగా వినపడటం ప్రారంభమైంది. భోళాశంకర్ ఫ్లాప్ కావడం వల్ల చిరు ఈ సారి ఆచితూచి సరైన కథ, దర్శకుడితో రావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఇప్పుడు వివి వినాయక్‌తో సినిమా చేసే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
చిరు రీఎంట్రీ.. వివి వినాయక్ దర్శకత్వంలోనే జరిగిందన్న సంగతి తెలిసిందే. ఖైదీ నెం.150తో బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంది. అంతేకాకుండా వివి వినాయక్‌కు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఆయన స్లోగా సినిమాలు చేస్తున్నప్పటికీ గతంలో ఆది, ఠాగూర్, అదుర్స్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను చేశారు.
రీసెంట్గా ఆయన బెల్లంకొండ శ్రీనివాస్‌తో ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు. ఈ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. కానీ ఈ చిత్రం బోల్తా కొట్టింది. అయినా వివి వినాయక్‌కు తక్కువ చేయలేం. సీన్స్ ఎలివేషన్స్, హీరో క్యారెక్టరైజేషన్ బాగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు చిరుతో సినిమా విషయమై తాజాగా జరుగుతున్న ప్రచారం నిజమైతే కనుక.. అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అదే సమయంలో వివి వినాయక్‌కు కూడా తన స్టామినా నిరూపించుకోవడానికి ఓ అవకాశం దొరికినట్టవుతుంది. చూడాలి మరి ఈ కాంబో నిజంజానే ఒకే అయితే ఎలాంటి కథతో వస్తారో.
ఇకపోతే వివి వినాయక్ పేరు ప్రచారంలోకి రాకముందు మెగా 157గా బింబిసార దర్శకుడు విశిష్ట పేరు బాగా వినిపించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సోషియో ఫ్యాంటసీ సినిమా అని అంతా అన్నారు. చూడాలి మరి చిరు విశిష్టతో వస్తారో లేదా తనకు మంచి హిట్స్‌ను అందించిన సీనియర్ దర్శకుడు వివి వినాయక్‌తో వస్తారో..