మెగాస్టార్ కి సరైన స్టార్ మేకర్ సెట్ అయ్యేదెప్పుడు?
కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న తనయని నిర్మాతగా మార్చాలని చిరంజీవి బలంగా సంకల్పించి ముందు కెళ్తున్నారు.
By: Tupaki Desk | 23 Aug 2024 7:27 AM GMTమెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగానైనా నిన్నటి రోజున ఆ సంగతేంటో తెలే అవకాశం ఉందని అభిమానులు ఆశించారు గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో 157వ సినిమా విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దర్శకుడు ఎవరైనా సరే నిర్మాతగా మాత్రం సుస్మితా కొణిదెల పరిచయం అవ్వడం లాంఛనమే. అందులో ఎలాంటి డౌట్ లేదు.
కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న తనయని నిర్మాతగా మార్చాలని చిరంజీవి బలంగా సంకల్పించి ముందు కెళ్తున్నారు. చరణ్ కూడా నటుడిగా బిజీగా ఉండటంతో సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై నిర్మాణం యాక్టివిటీ తగ్గించి తనయని ముందుకు తీసుకెళ్లాలని చిరు సీరియస్ గా ఉన్నారు. ఈనేపథ్యంలో సుస్మితని తెరపైకి తెస్తున్నారు. కానీ 157 కి మాత్రం సరైన దర్శకుడు సెట్ అవ్వడం లేదు.
రచయిత బి.వీ.ఎస్ రవి అందించిన స్టోరీ సిద్దంగా ఉంది. కానీ దాన్ని డీల్ చేసే దర్శకుడే లేడు. హరీష్ శంకర్, మోహన్ రాజా ఇలా కొంత మంది పేర్లు తెరపైకి వచ్చాయి. మోహన్ రాజా లాక్ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి మోహన్ రాజా ఎగ్జిట్ అయినట్లు కొత్త ప్రచారం మొదలైంది. హరీష్ శంకర్ విషయంలోనూ ఇలాంటి స్థబ్దతే కనిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన హరీష్ `మిస్టర్ బచ్చన్` కూడా ప్లాప్ అయింది.
కాబట్టి చిరు కూడా అతనితో ఇప్పుడు రిస్క్ తీసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ 157 కి ఎవరు రైట్ డైరెక్టర్ అన్నది సీరియస్ గా ఆలోచిస్తోన్న అంశంగా కనిపిస్తుంది. సీనియర్ డైరెక్టర్లు పూరి జగన్నాధ్ తీసుకుందామన్నా? అతడి ట్రాక్ ఈ మధ్య బాగాలేదు. ఇటీవలే రిలీజ్ అయిన `డబుల్ ఇస్మార్ట్` ప్లాప్ అయింది. త్రివిక్రమ్ ని తెరపైకి తెద్దామన్నా? అతను ఇతర రచయితల కథల్ని డైరెక్ట్ చేయరు. ఇప్పటికప్పుడుఎ చిరుకి తగ్గ స్టోరీ కూడా సిద్దంగా లేదు. ఇలా చిరంజీవికి దర్శకుల సమస్య తలెత్తింది. సరైన కథ, దర్శకుడు కుదిరితే వరుస పెట్టి 160 వరకూ లైనప్ వదలాలని మనసులో ఉన్నా? కుదరడం లేదు.