Begin typing your search above and press return to search.

చిరునా? ప‌వ‌నా? ఏంటి బాస్ క‌న్ఫ్యూజ‌న్?

ఇప్పుడు వ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి కోసం ఇట‌లీ టుస్కానీలో అడుగుపెట్టిన చిరంజీవి కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలోకి లీకైంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 4:27 AM GMT
చిరునా? ప‌వ‌నా? ఏంటి బాస్ క‌న్ఫ్యూజ‌న్?
X

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ ఇప్పుడు అంద‌రినీ క‌న్ఫ్యూజ్ చేస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్! అంటూ ఖైదీనంబ‌ర్ 150తో ఘ‌న‌మైన పున‌రాగ‌మ‌నం చేసిన మెగాస్టార్ గ‌డిచిన ఐదేళ్ల‌లో అద్భుత‌మైన విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు.. ప్ర‌తి సినిమాకి ఆయ‌న మేకోవ‌ర్ కూడా అంతే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. వ‌య‌సు 60 ప్ల‌స్ అయినా కానీ ఇంకా 40ల‌లోనే ఉన్నారా? అని సందేహం క‌లిగేలా ఆయ‌న లుక్ ని మార్చేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇప్పుడు వ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి కోసం ఇట‌లీ టుస్కానీలో అడుగుపెట్టిన చిరంజీవి కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలోకి లీకైంది. ఇది వ‌రుణ్ - లావ‌ణ్య జంట హ‌ల్దీ వేడుక‌లో స‌మ‌యంలో తీసిన ఫోటో. ఈ ఫోటోలో చిరు స్ట్రెయిట్ లుక్ లో కాకుండా ప్రొఫైల్ లో క‌నిపిస్తున్నారు. ఆయ‌న ప‌క్క పాపిడి పొందిగ్గా ఉంది. అయితే ఇలా చిరును చూసిన చాలా మంది అత‌డు ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. కొన్ని మీడియాలు అలానే ప్ర‌చురించాయి కూడా.

చిరు ఫోటోగ్రాఫ్ ప్రొఫైల్ లుక్ లో క‌నిపించ‌డంతో ఆయ‌న‌ను కొన్ని బాలీవుడ్ మీడియాల‌తో పాటు తెలుగు మీడియాలు కూడా గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాయి. సాంప్ర‌దాయ కుర్తాలో చిరు అలా బ్యాక్ ఫీట్ లో క‌నిపించేస‌రికి వెంట‌నే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేదు. పైగా పెళ్లికి చిరు కంటే ముందే ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగిపోయారు కాబ‌ట్టి ఇక్క‌డ క‌న్ఫ్యూజ‌న్ త‌లెత్తింది. బాస్ ఏజ్ 50ప‌ర్సంట్ త‌గ్గిపోయింద‌ని ఈ ఫోటో చెబుతోంది. దీనిని బ‌ట్టి మెగాస్టార్ చిరంజీవి త‌న మేకోవ‌ర్ కోసం ఎంత‌గా శ్ర‌మిస్తున్నారో అర్థం చేసుకోవాలి. భోళా శంక‌ర్ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేసిన చిరు త్వ‌ర‌లోనే సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. ఆయ‌న కాలికి చిన్న‌పాటి శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని అందుకే గ్యాప్ తీసుకున్నార‌ని కూడా ప్ర‌చారం సాగింది.