Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సూపర్‌ మెగా పవర్‌ పిక్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది

By:  Tupaki Desk   |   2 Jun 2024 3:30 PM GMT
పిక్ టాక్ : సూపర్‌ మెగా పవర్‌ పిక్‌
X

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తాజాగా చిత్ర షూటింగ్‌ జరుగుతున్న సమయంలో రామ్‌ చరణ్‌ సెట్స్ లో అడుగు పెట్టాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

విశ్వంభర సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ గా చేస్తున్న చోటా కే నాయుడు సోషల్‌ మీడియా ద్వారా ఈ ఆసక్తికర పిక్ ను షేర్ చేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి మరియు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ లతో చోటా కే నాయుడు ఫోటో తీసుకున్నాడు. వారి మధ్య నిల్చుని తీసుకున్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మెగా పవర్‌ అంటూ ట్యాగ్‌ లైన్ ఇచ్చి సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు ఈ పిక్ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం జరిగింది. నిజంగా ఇది సూపర్‌ మెగా పవర్‌ పిక్ అంటూ నెటిజన్స్‌ మరియు మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తెగ సందడి చేస్తున్నారు.

విశ్వంభర సినిమా విషయానికి వస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. త్రిష హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక రామ్‌ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్‌ ఛేంజర్‌ చివరి దశ షూట్‌ రీ స్టార్ట్ అవ్వబోతుంది.

గేమ్‌ ఛేంజర్ సినిమాతో పాటు బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు చరణ్‌ ఓకే చెప్పాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా చెప్పాడు. గేమ్‌ చేంజర్ లో చరణ్‌ కి జోడీగా కియారా నటిస్తుండగా, బుచ్చిబాబు సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించబోతుంది.