ఆయన కీర్తి అజరామరం..తరతరాలు శాశ్వతం!
కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ లోని ఆయన ఘాట్ వద్దకు చేరుకుని నివాళ్లు అర్పిస్తున్నారు
By: Tupaki Desk | 28 May 2024 6:44 AM GMTనటసార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ లోని ఆయన ఘాట్ వద్దకు చేరుకుని నివాళ్లు అర్పిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆస్ సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు.
`కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శమన్నారునందమూరి తారకరామారావు గారిని ఈ రోజు గుర్తు చేసుకుంటూ, వారు ప్రజాజీవితంలో చేసిన సేవలకు భారత రత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని` అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు ఎన్టీఆర్ తో తాను దిగిన ఫొటోను చిరంజీవి జత చేశారు.
ఈ ఫొటో చిరంజీవి భుజంపై ఎన్టీఆర్ చేయి వేసి హుందాగా నడుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం అనేది నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజల చిరకాల ఆకాంక్ష. ఇదే విషయాన్ని చిరంజీవి ఇటీవల ఢిల్లీలోనూ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం సందర్భఃగా చిరంజీవి ఢిల్లీ వెళ్లారు.
పద్మ విభూషణ్ అందుకున్న అనంతరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీడియా నుంచి సీనియర్ ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రస్తావన రాగా.. ఆయన దీనికి స్పందిస్తూ.. `అవును.. ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం ఎంతైనా సముచితం. నేను కూడా మనస్ఫూర్తిగాద దీనిని అభిలాషిస్తున్నాను. ఆయనకు భారతరత్న రావాలని కోరుకుంటున్నాను` అని బధులిచ్చారు. నేడు జయంతి సందర్భంగా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా `విశ్వంభర` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.