Begin typing your search above and press return to search.

కాలం మారినా మెగాస్టార్ మార‌నేలేదు!

మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ కొణిదెలతో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటో ఇంట‌ర్నెట్ లో షికార్ చేస్తోంది

By:  Tupaki Desk   |   13 May 2024 4:20 AM GMT
కాలం మారినా మెగాస్టార్ మార‌నేలేదు!
X

మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ కొణిదెలతో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటో ఇంట‌ర్నెట్ లో షికార్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఇది మెగా ఫ్యాన్ పేజీల్లో వైర‌ల్ గా షేర్ అవుతోంది. ఈ త్రోబ్యాక్ ఫోటో చాలా కాలంగా నెట్ లో ఉన్నా కానీ, ఇప్పుడు మ‌రోసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటోను షేర్ చేసారు. ఒకే ఫోటోలో మెర్జ్ చేసిన రెండు ఫోటోలు ఇవి. ''అమెరికాలో సంతోషకరమైన సెలవుదినం 1990'' నుండి ఒక‌టి.. ''జైలు.. ఫుల్ హాలిడే కరోనా 2020'' నాటిది మ‌రొక‌టి.. ఈ రెండు ఫోటోల్లో కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఒక‌టే. అందుకే రెండిటిని కొల్లేజ్ లా క‌లిపి వైర‌ల్ చేస్తున్నారు.

చిరంజీవి వంటగదిలో తన భార్య సురేఖకు సహాయం చేస్తున్నారు....! ఇంకా చెప్పాలంటే చిరు వంట వండుతుంటే సురేఖ‌నే స‌హాయం చేస్తోందేమో అనే అనుమానం క‌లిగేలా ఉంది ఈ ఫోటో క్లిక్. ఒక ఫోటోలో చిరంజీవి జీన్స్‌ ముదురు నీలం రంగు టీ-షర్టును ధరించారు. సురేఖ‌ ఎరుపు రంగు చీరలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోకి వేలాది లైక్‌లు వచ్చాయి. ట్విట్టర్‌లో దీనికి 17K లైక్‌లు .. 1.8K రీ-ట్వీట్‌లు వచ్చాయి.

కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే... చిరంజీవి ప్ర‌స్తుతం వ‌శిష్ఠ మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో 'విశ్వంభ‌ర' చిత్రంలో న‌టిస్తున్నారు. ఇది ఫాంట‌సీ యాక్ష‌న్ డ్రామా. ఇందులో త్రిష క‌థానాయిక‌. మ‌రోవైపు ప‌లువురు ద‌ర్శ‌కులు వినిపించిన క‌థ‌ల్ని చిరు లాక్ చేసారు. బోయ‌పాటితోను ఓ సినిమా చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది.