డాడీ-డాటర్ కాంబో డైరెక్టర్ ఎవరబ్బ?
చిరంజీవి 156వ చిత్రంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు న్నట్లు చిరు పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
By: Tupaki Desk | 22 Aug 2023 3:06 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆయన పెద్ద కుమార్తె సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పై ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 156వ చిత్రంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు న్నట్లు చిరు పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.' నాలుగు దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తున్న రాజసం.. తెరపైనే కాకుండా బయట కూడా బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి.. 'మెగా 156' సినిమాను మా బ్యానర్‌లోనే చేస్తున్నారు' అని వెల్లడించారు.
అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. వాస్తవానికి ఈ కాంబినేషన్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. కానీ 'భోళా శంకర్' రిలీజ్ తర్వాత ఇలాంటి సమయంలో కళ్యాణ్ కి ఛాన్స్ ఇవ్వడం కరెక్టేనా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి.
భోళా శంకర్ పై సోషల్ మీడియాలో నెగివిటీ తీవ్రస్థాయిలో రావడంతోనే ఈ రకమైన సందేహాలు మొదలయ్యాయి. తాజాగా అధికారిక ప్రకటనలో కళ్యాణ్ పేరు లేకపోవడంతో కొత్త సందేహాలకు తావిచ్చినట్లు అయింది.
కళ్యాణ్ కృష్ణ స్థానంలో వేరే దర్శకుడిని తీసుకుంటున్నారా? లేక ఆయన్నే ఖరారు చేసి తర్వాత రివీల్ చేసే ప్లాన్ లో భాగంగా హైడ్ చేసారా? అంటూ నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ట్విటర్ కామెంట్ లో బయట బంధాలకు కూడా విలువ ఇచ్చే మెగాస్టార్ అంటూ ఓ సంకేతం పాస్ చేసారు. ఈ నేపథ్యంలో చిరు-కళ్యాణ్ ని లైట్ తీసుకునే ఛాన్స్ లేదని వినిపిస్తుంది. చిరంజీవితో ఆయన జర్నీ చాలా కీలకమైనది. కళ్యాణ్ దర్శకుడు అవ్వడం వెనుక చిరంజీవి ఉన్నారు.
కళ్యాణ్ కృష్ణ తొలి సినిమా సొగ్గాడే చిన్ని నాయనా నాగార్జునతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ కాంబినేషన్ ని కలిపింది చిరంజీవినే. నాగార్జున ఇమేజ్ కి తగ్గ స్టోరీ కావడంతో చిరంజీవి నాగ్ వద్దకు రిఫర్ చేసారు. అలా ఆ సినిమా రూపం దాల్చింది. ఆ తర్వాత నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం కూడా చేసాడు కళ్యాణ్.
అలా అక్కినేని ఫ్యామిలతో ఓ అటాచ్ మెంట్ ఏర్పడింది. ఆరకంగా చిరంజీవి సన్నిహితుడిగా కళ్యాన్ మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో 156వ సినిమా ఛాన్స్ చిరు అతనికే ఇస్తారని గట్టిగా వినిపిస్తుంది. మరి అసలు సంగతేంటి? అన్నది అధికారికంగా వెల్లడిస్తే గానీ క్లారిటీ రాదు.