Begin typing your search above and press return to search.

మెగా విశ్వంభర.. అసలు వేట అప్పుడే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Dec 2023 2:30 PM GMT
మెగా విశ్వంభర.. అసలు వేట అప్పుడే..
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా మూవీ షూటింగ్ కి వెస్ట్ గోదావరి జిల్లాలో వశిష్ట స్టార్ట్ చేశారు. చిరంజీవి లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేశారు.

నెక్స్ట్ షెడ్యూల్ కోసం డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారంట. జనవరి చివరి వారంలో చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఒక్క వాల్తేర్ వీరయ్య మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

మిగిలిన సినిమాలు ఏవీ పెద్దగా మెప్పించలేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా చిరంజీవి నుంచి ఒక సాలిడ్ సినిమాని కోరుకుంటున్నారు. మెగాస్టార్ లో ఒకప్పటి చరిష్మా, గ్రేస్ చూపించే కథలో చూడాలని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జగదీక వీరుడు అతిలోక సుందరి లాంటి ఫిక్షనల్ సోషియో ఫాంటసీ కథని వశిష్ట మల్లిడి చిరంజీవికి చెప్పి ఒప్పించారు.

భోళా శంకర్ తో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న చిరంజీవి కూడా ఈ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కోసం చూస్తున్నారు. వశిష్ట అలాంటి ఇంటరెస్టింగ్ స్టొరీలైన్ చెప్పడంతో పట్టాలు ఎక్కించేశారు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట నుంచి రాబోతున్న మూవీ ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.

అలాగే సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా ట్రై చేసిన మెగాస్టార్ కి ఆశించిన సక్సెస్ రాలేదు. ఆ లోటుని విశ్వంభర తీరుస్తుందని నమ్మకంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్ 150 కోట్లకి పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారంట. మూవీలో చిరంజీవికి జోడీగా అనుష్క కనిపించబోతోంది అనే టాక్ నడుస్తోంది. మరి ఈ విశ్వంభరతో మెగాస్టార్ ఎలాంటి కథని ప్రేక్షకులకి చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.