ప్రభాస్ వస్తే చిరంజీవి వెనక్కి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 March 2024 5:09 AM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కే అవకాశం ఉంది. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ మూవీని వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ ఈ మూవీకి ఎక్కువ ఉండబోతోందని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ తో రెడీ అయ్యే ఫిక్షనల్ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చాలా వరకు రిలీజ్ డేట్స్ ఒకటి, రెండు సార్లు వాయిదా పడి ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.
విశ్వంభర కూడా అనుకున్న డేట్ కి రాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ తో పాటు మరో కారణం కూడా దీనికి ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్ మూవీని సంక్రాంతిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే విశ్వంభర రిలీజ్ బట్టి తమ రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ ఉంటుందని విశ్వప్రసాద్ గతంలో తెలిపారు. సంక్రాంతికి రాజాసాబ్ రిలీజ్ చేయాలనే ఆలోచన అయితే ఉందని స్పష్టం చేశారు. విశ్వప్రసాద్ కి మెగా ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే యూవీ అనేది ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిది. ప్రభాస్ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటే విశ్వంభరని వెనక్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.
ఎలాగూ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పరంగా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరో డేట్ ని కూడా యూవీ క్రియేషన్స్ వారు విశ్వంభర కోసం చూసే పనిలో ఉన్నారంట. ఇలా జరిగితే మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ కి సినిమాల పరంగా క్లాస్ వచ్చే అవకాశం అయితే మేగ్జిమమ్ ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే సంక్రాంతి సీజన్ కి రాజాసాబ్ రిలీజ్ అయిన కూడా మరో మూడు సినిమాల వరకు రేసులో ప్రభాస్ తో పోటీ పడొచ్చని టాక్.
ఇక సంక్రాంతి కోసం అనిల్ రావిపూడి - వెంకటేష్ సినిమా కూడా ఉండవచ్చు. దిల్ రాజు ఆ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శతమానం భవతి 2 ని కూడా దిల్ రాజు సంక్రాంతి టైమ్ లో తీసుకు రావచ్చు. మరోవైపు నాగార్జున కూడా ఓ సినిమాతో వచ్చే ఛాన్స్ ఉంది. హనుమాన్ హిట్ సెంటిమెంట్ తో జై హనుమాన్ ను కూడా వచ్చే సంక్రాంతికి తీసుకు రావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.