Begin typing your search above and press return to search.

చాలా కాలం తర్వాత చిరు ఇంత జాగ్రత్త...!

సాధారణంగా ఈ మధ్య కాలంలో సంగీత దర్శకుడు, దర్శకుడు కూర్చుని పాటలు పూర్తి చేస్తున్నారు. కానీ విశ్వంభర కి అలా జరగడం లేదు.

By:  Tupaki Desk   |   15 July 2024 6:56 AM GMT
చాలా కాలం తర్వాత చిరు ఇంత జాగ్రత్త...!
X

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాను చేస్తున్నాడు. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ మెల్లగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అంటూ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా సంక్రాంతిపై దృష్టి పెట్టారు.

ఒక వైపు మెల్లగా షూటింగ్‌ పూర్తి చేస్తూ మరో వైపు సంగీతం పని కూడా ముగిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్న విషయం తెల్సిందే. సాధారణంగా ఈ మధ్య కాలంలో సంగీత దర్శకుడు, దర్శకుడు కూర్చుని పాటలు పూర్తి చేస్తున్నారు. కానీ విశ్వంభర కి అలా జరగడం లేదు.

చిరంజీవి చాలా కాలం తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నాడు. గంటల తరబడి దర్శకుడు వశిష్ఠ మరియు సంగీత దర్శకుడు కీరవాణి తో కలిసి చిరంజీవి మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో పాటలకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో మ్యూజిక్ విషయంలో చిరు ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాడట.

గతంలో చిరంజీవి మరియు కీరవాణి కాంబోలో సూపర్‌ హిట్‌ ఆల్బం లు వచ్చాయి. ఆ స్థాయిలో, ఈ తరం వారికి నచ్చే విధంగా విశ్వంభర ఆల్బం ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. త్రిష హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో మృణాల్‌ గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతుందని తెలుస్తోంది.

ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌, ఆషికా నంగనాథ్‌, ఇషా చావ్లా, సుభి లు నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో వంశీ ప్రమోద్‌ లు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ ప్రేక్షకులకు విందు భోజనం మాదిరిగా ఉండబోతుందని అంటున్నారు.