Begin typing your search above and press return to search.

'విశ్వంభర' ఆగమనం.. గేట్ రెడీ!

ఆగస్టు 22 రోజున మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

By:  Tupaki Desk   |   12 Aug 2024 3:30 PM GMT
విశ్వంభర ఆగమనం.. గేట్ రెడీ!
X

ఆగస్టు 22 రోజున మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ స్పెషల్ డే ఏదో ఒక సినిమా అప్‌డేట్ రాకుండా ఉండదు. ఈసారి కూడా అభిమానులకు చిరు నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ రాబోతోంది. ‘విశ్వంభర’ అనే సినిమా టీజర్ రిలీజ్ కాబోతుంది.

బింబిసార విజయంతో మంచి క్రేజ్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. టీజర్ కట్ ఇప్పటికే ఫినిష్ అయిందని, ప్రస్తుతం ఫైనల్ ఎడిటింగ్ తో పాటుగా నేపథ్య సంగీతం పనులు మిగిలివున్నాయని సమాచారం.

టీజర్ గురించి ఇప్పటికే ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న రిపోర్ట్స్ ప్రకారం, ఇది ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేలా ఉంటుందని చెబుతున్నారు. కల్కి, RRR టీజర్లు ఇచ్చిన అదే ఫీలింగ్‌ను విశ్వంభర టీజర్ కూడా ఇవ్వనుందట. ఈ టీజర్ ద్వారా హాలీవుడ్ స్థాయి మేకింగ్‌ను చూసే అవకాశం ఉంటుందట. మరీ ముఖ్యంగా చిరంజీవి లుక్‌కి అభిమానులు ఫిదా అయ్యేలా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.

టీజర్‌లో కొన్ని డైలాగులు కూడా ఉంటాయని, ఈ డైలాగుల ద్వారా ‘విశ్వంభర’ కాన్సెప్ట్ ను హైలెట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో, వశిష్టకు ఈ చిత్రం చాలా కీలకం. తన రెండో సినిమా ద్వారా చిరంజీవిని డైరెక్ట్ చేయడం, వశిష్టకు కెరీర్‌లో ఒక బిగ్ ఛాన్స్ అని చెప్పవచ్చు. రామ్ చరణ్ తో అతను ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్‌కి స్థానంలో ఈ సినిమా పట్టాలెక్కడం జరిగింది.

ఈ ప్రాజెక్ట్‌ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. విశ్వంభర’ హిట్ అయితే, వశిష్టకు వెంటనే రామ్ చరణ్ డేట్స్ ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో టీజర్ కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో, అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఆగస్టు 22 చిరు ఫ్యాన్స్ కు మరచిపోలేని రోజు కాబోతోందని మేకర్స్ చెబుతున్నారు. మరి టీజర్ ఏ స్థాయిలో కిక్ ఇస్తుందో చూడాలి.