Begin typing your search above and press return to search.

పారిస్‌లో ఒలింపిక్ టార్చ్‌తో చిరు- సురేఖ దంప‌తులు

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్ 'సమ్మర్ ఒలింపిక్స్ 2024' ఈరోజు ముందుగా ఫ్రాన్స్‌లోని పారిస్‌లో గ్రాండ్ గా ప్రారంభమైంది

By:  Tupaki Desk   |   27 July 2024 2:05 PM GMT
పారిస్‌లో ఒలింపిక్ టార్చ్‌తో చిరు- సురేఖ దంప‌తులు
X

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్ 'సమ్మర్ ఒలింపిక్స్ 2024' ఈరోజు ముందుగా ఫ్రాన్స్‌లోని పారిస్‌లో గ్రాండ్ గా ప్రారంభమైంది. 2 వారాల పాటు జరిగే ఈ క్రీడా ఉత్స‌వాల‌లో 200 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. దీనికోసం ఏర్పాట్ల‌కే ఏకంగా 1ల‌క్ష కోట్లు ఫ్రాన్స్ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ క్రీడా సంబ‌రాల్లో భార‌త‌దేశం నుంచి ప్ర‌తిభావంతులు పాల్గొంటున్నారు. వారంతా ప‌త‌కాలు గెలుచుకోవాల‌ని భార‌తీయులు ఆకాంక్షిస్తున్నారు. చాలా మంది సెల‌బ్రిటీలు వారికి సోష‌ల్ మీడియాల్లో విషెస్ చెబుతున్నారు. ప‌లువురు టాప్ సెల‌బ్రిటీలు ఒలింపిక్స్ వీక్షించేందుకు ప్యారిస్ కి వెళ్లారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లిన్ కారాతో కలిసి పారిస్ వెళ్లారు. అక్క‌డ భారతీయ క్రీడాకారుల‌ను వారు ఉత్సాహపరిచారు. చిరు ఈ మధ్యాహ్నం Xకి ఖాతాలో అరుదైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు. పారిస్‌లోని సీన్ నది వద్ద ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకుని ఉన్న ఫోటోని పంచుకున్నారు.

#PARIS2024 #ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న సంతోషకరమైన క్షణం అని చిరు ట్వీట్ చేశారు. అనుభవజ్ఞుడైన సీనియ‌ర్ హీరో చిరంజీవి మన భారత బృందంలోని ప్రతి క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలుపుతూ, ''ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ది బెస్ట్ మెడల్ టాలీ! గో ఇండియా!! జై హింద్'' అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఒలింపిక్స్ నుంచి తిరిగి వ‌చ్చాక మెగాస్టార్ విశ్వంభ‌ర షూటింగ్ ని పూర్తి చేస్తారు. అలాగే చ‌ర‌ణ్ త‌న గేమ్ ఛేంజ‌ర్ స‌హా ఇత‌ర చిత్రాల‌ కోసం వ‌ర్క్ చేస్తారు.