Begin typing your search above and press return to search.

బాల‌య్య‌తో క‌లిసి ఫ్యాక్ష‌న్ సినిమాలో న‌టిస్తా: చిరంజీవి

ఇక వేదిక‌పై బాల‌య్య‌తో త‌న స్నేహానుబంధం గురించి చిరు మాట్లాడిన తీరు అభిమానుల హృద‌యాల‌ను ట‌చ్ చేసింది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 5:04 AM GMT
బాల‌య్య‌తో క‌లిసి ఫ్యాక్ష‌న్ సినిమాలో న‌టిస్తా: చిరంజీవి
X

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఐదు ద‌శాబ్ధాల కెరీర్ ప్రయాణాన్ని నేటి సాయంత్రం హైద‌రాబాద్ లో తెలుగు చిత్ర‌సీమ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో సెల‌బ్రేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కు అతిర‌థ‌మ‌హార‌థులంతా హాజ‌ర‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను తెచ్చారు. ఇక వేదిక‌పై బాల‌య్య‌తో త‌న స్నేహానుబంధం గురించి చిరు మాట్లాడిన తీరు అభిమానుల హృద‌యాల‌ను ట‌చ్ చేసింది.

చిరంజీవి మాట్లాడుతూ బాల‌య్య‌తో క‌లిసి ఒక ఫ్యాక్ష‌న్ సినిమా చేయాల‌నుంద‌ని అన్నారు. ఇంద్ర సినిమాకి స‌మ‌ర‌సింహారెడ్డి ఒక స్ఫూర్తి అని కూడా అన్నారు. చిరు మాట్లాడుతూ-``బాలయ్య బాబు 50 సంవత్సరాల ఈ కన్నుల వేడుకలో మేము పాలు పంచుకోవడం చాలా ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఒక వేడుకలా చూస్తున్నాను. ఇలాంటి అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయ‌న‌ కొడుకుగా బాలకృష్ణ తండ్రి అడుగుజాడల్లో అలాంటి పాత్రల్లో చేస్తూ కూడా ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమర సింహా రెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండ‌రు. అందరం కలిసి డ్యాన్స్ కూడా చేస్తాం. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనరీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ వినోద‌ రంగాలలో ఇలా సేవ చేయడం నభూతో న భవిష్యత్. మేమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల‌ని కోరుకుంటూ లాంగ్ లివ్ బాలయ్య`` అని అన్నారు.

వేడుక‌లో క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ-``మేము ఒక కుటుంబం లాంటి వాళ్ళం. బాల‌య్య‌కు తమ్ముడు లాంటి వాడిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించినందుకు నాకు ఎంతో సంతోషం. మేం చెన్నైలో ఉన్నప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళం. మీరు ఇలాగే 100 సంవత్సరాలు వేడుకలు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను`` అని అన్నారు.