సీనియర్లు ఇద్దరు యమా స్పీడ్ గా!
అలా నలుగురు ఒకే జనరేషన్ హీరోలుగా ఇండస్ట్రలో గుర్తింపు తెచ్చు కున్నారు.
By: Tupaki Desk | 9 Jan 2025 4:30 PM GMTచిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లలో సీనియర్లు ఎవరు? అంటే రెండు రకాలుగా చెప్పాలి. నాగ్, వెంకీ, బాలయ్యలు చైల్డ్ ఆర్టిస్టులుగానే కెరీర్ ప్రారంభించారు. ఆ రకంగా చిరంజీవి కంటే వాళ్లు సీనియర్లు. కానీ హీరోగా సీనియర్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి. అలా నలుగురు ఒకే జనరేషన్ హీరోలుగా ఇండస్ట్రలో గుర్తింపు తెచ్చు కున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు జనరేషన్ హీరోల తర్వాత తరం హీరోలగా చిరు, నాగా, బాలయ్య, వెంకీలు ఎంతో ఫేమస్ అయ్యారు.
ఒకప్పుడు ఈ నలుగురు హీరోల మధ్యా నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ ఉండేది. అభిమాన సంఘాలు అలాగే పోటీ పడేవి. అప్పట్లో సినిమా స్థాయి అలా ఉండేది. మరిప్పుడు ఈ నలుగురు సీనియర్లలో వేగంగా సినిమాలు చేస్తోంది ఏ హీరోలు అంటే? చిరంజీవి, బాలయ్య పేర్లే కనిపిస్తున్నాయి. ఇద్దరు పోటీపోటీగా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమా స్క్రిప్ట్ లాక్ చేయడం...సెట్స్ కు వెళ్లడం చేస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ 'డాకు మహారాజ్' తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈసినిమా సెట్స్ లో ఉండగానే బోయపాటి శ్రీను తో 'అఖండ తాడవం' లాక్ చేసారు. ఈ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. 'డాకు మహారాజ్' రిలీజ్ అనంతరం బాలయ్య సెట్స్ కి వెళ్తారు. మెగాస్టార్ చిరంజీవి ఇదే జోష్ లో ముందుకె ళ్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' సెట్స్ లో ఉండగానే రెండు ప్రాజెక్ట్ లు పైనల్ చేసారు.
'దసరా' ఫేం శ్రీకాంత్ తో తో చిత్రం..అనీల్ రావిపూడితో మరో చిత్రం లాక్ చేసారు. 'విశ్వంభర' షూటింగ్ ముగించిన అనంతరం శ్రీకాంత్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇది సగం షూట్ పూర్తికాగానే అనీల్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం.ఆ తర్వాత వెంకేటేష్ కాస్త దూకుడుగా సినిమాలు చేస్తున్నారు. సోలో సినిమాలతో పాటు మల్టీస్టారర్ లు చేస్తున్నారు. నాగార్జున మాత్రం స్పీడ్ తగ్గించారు. సోలో స్క్రిప్ట్ లు సరైనవి రాకపోవడంతో మల్టీస్టారర్ కి మెగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ధనుష్ తో కలిసి 'కుబేర'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.