Begin typing your search above and press return to search.

బాల‌య్య సినిమాకి మెగాస్టార్ ప్ర‌చారం!

ప్ర‌యోగాల‌కు సైతం బాల‌య్య వెన‌క‌డుగు వేయ‌ర‌ని తొలిసారి ఆ సినిమాతోనే ప్రూవ్ చేసారు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 12:30 PM GMT
బాల‌య్య సినిమాకి మెగాస్టార్ ప్ర‌చారం!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ హీరోగా న‌టించిన సినిమాకి మెగాస్టార్ చిరంజీవి ప్ర‌చారం చేసారా? అంటే అవుననే విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. అప్ప‌ట్లో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడి సింగీతం శ్రీనివాస‌రావు తెర‌కెక్కించిన `ఆదిత్య 369` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. తెలుగు సినిమాకి కొత్త సాంకేతి క‌త‌ను ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. బాల‌య్య కెరీర్ లోనే ఓమైలురాయిలా నిలిచిన చిత్రం.

ప్ర‌యోగాల‌కు సైతం బాల‌య్య వెన‌క‌డుగు వేయ‌ర‌ని తొలిసారి ఆ సినిమాతోనే ప్రూవ్ చేసారు. అయితే ఈసినిమా ప్ర‌చారానికి మెగాస్టార్ చిరంజీవి సైతం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అనంత‌రం మ‌రింత ప్ర‌చారం క‌ల్పించ‌డం కోసం మేక‌ర్స్ చిరంజీవిని అభ్య‌ర్దించ‌డంతో ఆయ‌న మీడియా ముందుకొచ్చి ప్ర‌సారం చేసారుట‌.

ప్ర‌త్యేకంగా పిల్ల‌ల్ని, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని ఆక‌ర్షించ‌డానికి చిరంజీవి లాంటి స్టార్ హీరో ఉంటే బాగుంటుంద‌ని భావించి నిర్మాత దూర‌ద‌ర్శ‌న్ లో కొన్ని ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌సారాలు చేయాల‌ని ప్లాన్ చేసారు. చిరంజీవి తో ప్ర‌చారం చేయిస్తే మ‌రింత మంది ఆడియ‌న్స్ థియేట‌ర్ కి వ‌చ్చి చూస్తార‌ని భావించి నిర్మాత అడ‌గ్గానే చిర‌జీవి వెంట‌నే ఒప్పుకున్నారుట‌.

అలాగే ఆ సినిమాకి సంబంధించిన యాడ్ లోనూ న‌టించారుట‌. దూర‌ద‌ర్శ‌న్ లో ఆ యాడ్స్ ఆ సినిమా కి ఎంతో మంచి ఫ‌లితాలు తీసుకొచ్చాయ‌ని చెబుతున్నారు. అలా బాల‌య్య‌కి చిరంజీవి ఆనాడే స‌హాయం చేసారు. ఇక ఇటీవ‌లే బాల‌య్య పేరిట జ‌రిగిన స్వ‌ర్ణోత్స వేడుక కు చిరంజీవ గెస్ట్ గా విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే వేదిక‌పై `ఇంద్ర‌`, `స‌మ‌ర‌సింహారెడ్డి` లాంటి స్టోరీలో బాల‌య్య‌-తాను హీరోలుగా న‌టించాల‌ని అన్న ఆస‌క్తిని చిరు వ్య‌క్తం చేసారు. ఆ ఛాన్స్ ముందుగా బోయ‌పాటికే క‌ల్పించారు. మ‌రి ఆ కాంబినేష‌న్ ని క‌లిపేది ఎవ‌రు? అన్న‌ది చూడాలి.