విశ్వంభర.. ఏం ప్లాన్ చేస్తున్నారు?
అందుకే విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విశ్వంభర టీజర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు.
By: Tupaki Desk | 14 Sep 2024 4:12 AM GMTమెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ వాల్తేరు వీరయ్య. అంతకు ముందు, తరువాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేదు. ఒక్క సైరా తప్ప చిరంజీవి అన్ని సినిమాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ లతోనే వచ్చాయి. అయితే ట్రెండ్ కి తగ్గట్లు గా చిరంజీవి నుంచి మెగా ఫ్యాన్స్ కొత్తదనం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. రీమేక్ కథలని చూడటానికి ఇష్టపడటం లేదు.
దీనిని దృష్టిలో ఉంచుకొని మెగాస్టార్ చిరంజీవి వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విశ్వంభర మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టైటిల్ కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకున్నాయి. దీంతో కచ్చితంగా ఈ మూవీ బియాండ్ ది బౌండరీలో ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అందుకే విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విశ్వంభర టీజర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఎందుకనో టీజర్ ని వదలలేదు. ఒక పోస్టర్ తో సరిపెట్టారు. అయితే దసరాకి విశ్వంభర మూవీ టీజర్ ని లాంచ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంట. అప్పటి నుంచే మూవీ ప్రమోషన్స్ కూడా షురూ చేయనున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10 ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఆంధ్రా రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయంట. 60 కోట్లకి ఆంధ్రా రైట్స్ అమ్ముడయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అలాగే నాన్ థీయాట్రికల్ రైట్స్ కోసం టాప్ స్ట్రీమింగ్ కంపెనీలు పోటీ పడుతున్నాయంట. ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది.
దీని తర్వాత మూడు వారాల గ్యాప్ లోనే మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలు భారీ సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలని థియేటర్స్ లో ఆస్వాదించే ఛాన్స్ మెగా ఫ్యాన్స్ కి వస్తోంది. దీనిపై ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కచ్చితంగా తండ్రి, కొడుకుల కెరియర్ లో గేమ్ చేంజర్, విశ్వంభర బెస్ట్ మూవీస్ అవుతాయని భావిస్తున్నారు.