Begin typing your search above and press return to search.

చిరంజీవి- బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్ రేసులో ఆ న‌లుగురు?

నటసింహా నందమూరి బాలకృష్ణ కెరీర్ జ‌ర్నీ ఐదు ద‌శాబ్ధాలు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Sep 2024 5:49 AM GMT
చిరంజీవి- బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్ రేసులో ఆ న‌లుగురు?
X

నటసింహా నందమూరి బాలకృష్ణ కెరీర్ జ‌ర్నీ ఐదు ద‌శాబ్ధాలు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎన్బీకే 50 వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ కు చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిథులుగా ఎటెండ‌యిన సంగ‌తి తెలిసిందే. చిరు-ఎన్బీకే-వెంక‌టేష్ ల యూనిక్ ఫ్రేమ్ ఈవెంట్ కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అయితే ఇదే వేదిక‌పై మెగాస్టార్ చేసిన ప్ర‌క‌ట‌న టాలీవుడ్ లో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. బాల‌య్య బాబుతో క‌లిసి ఫ్యాక్ష‌న్ సినిమా చేయాల‌నుంద‌ని మెగాస్టార్ త‌న ఆకాంక్ష‌ను వెలిబుచ్చారు.

చిరంజీవి తన బ్లాక్‌బస్టర్ ఇంద్రకు బాల‌య్య `సమరసింహారెడ్డి` ప్రేరణనిచ్చింద‌ని చిరు అన్నారు. ఫ్యాక్షనిస్ట్ పాత్రలు బాలయ్యకు తగినట్లుగా ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు. బాలకృష్ణతో కలిసి పనిచేయడానికి చిరంజీవి త‌న ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ కథను రూపొందించే ఛాలెంజ్‌ని స్వీకరించాల్సిందిగా దర్శకుల‌ను కోరారు.

టాలీవుడ్ కి చెందిన ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్‌ను పంచుకునే అవకాశం అభిమానులను నిజంగా ఎగ్జ‌యిట్ చేసింది. ప్ర‌స్తుతం ఇది నంద‌మూరి మెగా అభిమానుల్లో చ‌ర్చ‌గా మారింది. చిరంజీవి- బాల‌కృష్ణ మ‌ల్టీస్టార‌ర్ కి ప‌చ్చ‌జెండా ఊపేసారు గ‌నుక‌.. బోయపాటి బ‌రిలోకి దిగుతారా? లేక ఫ్యాక్ష‌న్ సినిమాల స్పెష‌లిస్ట్ బి.గోపాల్ కి మ‌రో ఛాన్స్ ఉంటుందా? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

గోపిచంద్ మ‌లినేని, అనీల్ రావిపూడి లాంటి యువ‌ద‌ర్శ‌కులు ఎన్బీకేతో ర్యాపో క‌లిగి ఉన్నారు గ‌నుక వీళ్ల‌లో ఎవ‌రైనా చిరు-బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్టును రెడీ చేస్తారా? అన్న చ‌ర్చా వేదిక వ‌ద్ద వేడెక్కించింది. చిరంజీవి- బాల‌కృష్ణ కాంబోని సెట్ చేసేందుకు ఇప్ప‌టికే న‌లుగురు ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం మెండుగా ఉంది. ఇంకా రేసులో ఎంద‌రు ఉంటారు? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. ఏది విజ‌యవంతంగా ముందుకు సాగాల‌న్నా స్క్రిప్టు కీల‌కం. ఇద్ద‌రు దిగ్గ‌జ హీరోల్ని బ్యాలెన్స్ చేస్తూ అద్భుత‌మైన ఎలివేష‌న్స్ తో ఈ సినిమాని తెర‌కెక్కించాల్సి ఉంటుంది. కానీ ఈ ఛాలెంజ్ ని ఎవ‌రు తీసుకోగ‌ల‌రు? అన్న‌దే వేచి చూడాలి. మ‌న ద‌ర్శ‌క దిగ్గ‌జాలు అలా చేస్తే అది టాలీవుడ్‌కి చారిత్రాత్మక సినిమా అవుతుంది.