అందరికీ హెడ్ మాస్టర్ పెదనాన్నే!
అందుకే ప్రతీ ఏడాది సంక్రాంతిని బెంగుళూరు ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా అందరితో కలిసి చిరంజీవి సెలబ్రేట్ చేసుకుంటారు.
By: Tupaki Desk | 7 Nov 2024 5:38 AM GMTమెగా ఫ్యామిలీ ఎంతో పెద్దది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముళ్లు, పిల్లలు, మనవలు, కోడళ్లు, తోబుట్టువులు, మేనల్లుళ్లు ఇలా చాలా పెద్ద ఫ్యామిలీ. అందులోకి అల్లు ఫ్యామిలీని కూడా కలిపితే మరింత పెద్దగా కనిపిస్తుంది. అందుకే ప్రతీ ఏడాది సంక్రాంతిని బెంగుళూరు ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా అందరితో కలిసి చిరంజీవి సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ వేడుక మాత్రం ఫ్యామిలీలో ఏ ఒక్కరూ మిస్ అవ్వరు.
ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి సంబంధించిన వారసత్వం కొనసాగుతుందన్నా? ఆ ఫ్యామిలీ నుంచి ఇంకేవరైనా ఇండస్ట్రీకి వచ్చారు? అంటే దానికి కారణం చిరంజీవి అనే మహా వృక్షం వల్ల మాత్రమే. ఆయన లేకపోతే ఇండస్ట్రీలో చిరు బంధువులెరూ ఉండేవారు కాదు. సక్సెస్ అయిన తర్వాత మెగా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఘంటా పధంగా చెప్పే మాట ఇది. ఇక చరణ్ తర్వాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ అంటే ఎంతో ఇష్టం.
చరణ్ సమానంగా చూస్తారు. వరుణ్ పెద్దవాడైనా..హీరో అయినా ఇప్పటికీ చిరంజీవి అతడిని ఎంతో గారాబం చేస్తుంటారు. బుగ్గులు గిల్లి ముద్దాడుతారు. పెదనాన్నలో ఆ ప్రేమను చూసి వరుణ్ మురిసిపోవడంతో పాటు సిగ్గు కూడా పడిపోతుంటాడు. తాజాగా వరుణ్ తేజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. మేమంతా ఒకే చోట కలిసి పెరిగాం. ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నాం.
అందువల్లే ఒకరికొకరు కలుసుకోలేకపోతున్నాం. కానీ ప్రతీ సంక్రాంతికి మాత్రం అందరం తప్పకుండా ఒకే చోట కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతి నాలుగు రోజులు బాగా ఎంజాయ్ చేస్తాం. మా అందర్నీ కంట్రోల్ లో ఉంచేది పెదనాన్న చిరంజీవి గారే. ఆయన మా కుటుంబంలో హెడ్ మాస్టర్` అని అన్నారు. అయితే సంక్రాంతి వేడుకల్లో అప్పుడప్పుడు అల్లు ఫ్యామిలీ మిస్ అవుతుంటుంది. వాళ్ల బిజీ షెడ్యూల్ కారణంగా వీలు పడదు.