చిరంజీవిపై విమర్శలు.. 'బేబి' నిర్మాత కౌంటర్
చిరు పరిహాసం, హాస్య చతురతను ప్రస్థావించని మీడియాలు ఇష్టానుసారం కథనాలు అల్లేశాయి.
By: Tupaki Desk | 13 Feb 2025 2:53 PM GMTఇటీవల ఓ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి 'ఆడపిల్ల' గురించి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలను కొన్ని మీడియాలు తప్పు పడుతూ రాద్ధాంతం చేసాయి. ఆడిపిల్ల వద్దు మగ పిల్లాడు ముద్దు! అని చిరుపై కథనాలు ప్రచురించాయి. చిరు పరిహాసం, హాస్య చతురతను ప్రస్థావించని మీడియాలు ఇష్టానుసారం కథనాలు అల్లేశాయి.
దీనిపై ఇప్పుడు 'బేబి' చిత్రనిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. అన్నయ్య చిరంజీవిపై ఇష్టానుసారం కథనాలు వేసిన మీడియా చానెళ్లను ఉద్ధేశించి ఘాటుగా విమర్శించారు. ఎస్కేఎన్ ఏమన్నారంటే... ''పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపాక కూడా తన స్వార్జిత ఆస్తులను వారికి పంచిన వ్యక్తిత్వం ఆయనది. నిజమైన ఫ్యామిలీమ్యాన్. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా ఆయనపై ఊరికే అవాకులు చవాకులు పేలడం, అనవరంగా రాద్ధాంతం చేయడం, తద్వారా పిచ్చి ఆనందం పొందడం కొందరికి అలవాటు'' అని వ్యాఖ్యానించారు.
రామ్ చరణ్ కి రెండో బిడ్డ మగ పిల్లాడు పుట్టాలని ఆశిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి బహిరంగ వేదికపై అన్నారు. తమ ఇంట్లో ఇప్పటికే ఆడ పిల్లలు తన చుట్టూ ఉన్నారని, దీంతో లేడీస్ హాస్టల్ లా మారిందని, వారికి నేను వార్డెన్ ని అని చిరంజీవి అన్నారు. తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనవడు వస్తాడని ఆశిస్తున్నట్టు మెగాస్టార్ వ్యాఖ్యానించారు. చరణ్ రెండో బిడ్డ మగపిల్లాడు కావాలని చిరు కోరుకున్నారు. కానీ దీనిని కొందరు తప్పు పట్టగా, మరికొందరు తనకు లేనిది కలగాలని కోరుకోవడం తప్పు కాదని మద్ధతుగా నిలిచారు. అయితే చిరంజీవి సరదాగా మాట్లాడేస్తూ అందరినీ నవ్విస్తూ ఆ మాటలు అన్నారు కానీ, దానిని మీడియాలు ఇంతగా రచ్చ చేస్తాయని ఎవరూ ఊహించలేదు.