Begin typing your search above and press return to search.

రియల్, రీల్..నాయికలతో మెగాస్టార్..!

ఆ ఫోటోలో చిరంజీవి సతీమణి సురేఖతో పాటు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న కథానాయికలు ఉన్నారు.

By:  Tupaki Desk   |   7 March 2025 11:08 PM IST
రియల్, రీల్..నాయికలతో మెగాస్టార్..!
X

మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తన నిజ జీవితాన్ని, సినీ జీవితాన్ని పంచుకుని విజయాన్ని అందించిన హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ మెసేజ్ తో పాటు ఆయన ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలో చిరంజీవి సతీమణి సురేఖతో పాటు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న కథానాయికలు ఉన్నారు.

వారిలో రాధిక, టబు, నదియా, జయసుధ, మీనా, సుహాసిని, కుష్బూ ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవితంలో ఉన్న మహిళా మూర్తులందరికీ తన తరపు నుంచి శుభాకాంక్షలు అందించారు చిరంజీవి. మెగాస్టార్ షేర్ చేసిన ఫోటోతో పాటు ఆయన పెట్టిన కామెంట్స్ కూడా మెగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. ఎలాంటి పండగ అయినా అభిమానులను ఉద్దేశిస్తూ చిరంజీవి శుభాకాంక్షలు చెబుతుంటారు. ఐతే మహిళా దినోత్సవం సందర్భంగా తనతో పనిచేసిన వారి గురించి ప్రస్తావించారు చిరంజీవి.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 నుంచి వరుస సినిమాలు చేస్తున్న చిరు మధ్యలో ఎక్కడో మూస ధోరణిలో వెళ్తున్నారన్న టాక్ వచ్చింది. అందుకే ఈసారి డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నిస్తున్నారు మెగాస్టార్.

విశ్వంభర సినిమా చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలోనే ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఈ సినిమా అసలైతే ఈ సంక్రాంతికి రావాల్సి ఉన్నా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కోసం వాయిదా వేశారు. విశ్వంభర రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వంభర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నారు. ఈ సినిమాను కూడా త్వరగా పూర్తి చేసి 2026 సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది.