కోడలు..మనవరాలు గురించి చిరు ఏమన్నారంటే?
తాజాగా వారిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
By: Tupaki Desk | 10 May 2024 12:18 PM GMTమెగాస్టార్ ఇంట కోడలైన తర్వాత ఉపాసన జర్నీ ఎలా సాగుతుందో తెలిసిందే. అప్పటివరకూ బిజినెస్ ఉమెన్ గానే ఉన్న ఉపాసనకి చరణ్ తో వివాహం అనంతరం సెలబ్రిటీ హోదా దక్కింది. వివాహమనంతరం మెగా కుటుంబం లో చాలా తొందరగా కలిసి పోయారు. ఇక అత్తా-కోడళ్ల మధ్య సరసాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు ఎంతో సరదాగా ఉంటారు. అత్తాకోడళ్లుగా కాదు...తల్లీకూతురు మధ్య ఉన్నంత బాండింగ్ సురేఖ-ఉపాసన మధ్య కనిపిస్తుంటుంది.
వాళ్లిద్దర్నీ అలా చూసి చిరంజీవి కుమార్తెలు కూడా కుళ్లుకుంటారేమో అన్నంత అన్యోన్యంగా మెలుగుతారు. తాజాగా ఉపాసన చిరంజీవితో కూడా ఎంతో సరదాగా ఉంటారని తెలుస్తోంది. తాజాగా వారిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ఉపాసన 'మావయ్య క్లీంకారకు- నాకు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో చెప్పండి? అంటారు. దానికి చిరంజీవి ఒక క్షణం ఆలోచించి 'క్లీంకార నీకు ప్రతిరూపం' అంటారు.
ఉపాసన తాతగారికి పద్మ విభూషణ్ అని చిరంజీవి అంటే ! ఉపాసన వెంటనే 'నో..మావయ్య... మేమిద్దరం... పద్మ విభూషణ్ ల' మరవరాళ్ళం అంటూ నవ్వేస్తారు. ఆ వెంటనే చిరంజీవి కూడా నిజమే కదా అంటారు. ఇది మీ బిగ్గెస్ట్ అవార్డు కదా? మీ ఫీలింగ్ ఏంటి అంటే? దానికి చిరంజీవి 'క్లీంకార వచ్చిన తర్వాత ఇది బిగ్గెస్ట్' అవార్డు అంటారు. ఇలా మామ-కోడలి మధ్య సరదా సంభాషణ సాగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అది చూసి అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. చిరంజీవి -ఉపాసన ఎంతో జోవియల్ గా ఉంటారంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సంభాషణ మధ్యలో రామ్ చరణ్ కూడా ఉంటే బాగుండని మరికొంత మంది అభిమానులు కోరుకున్నారు. ఉపాసన తాతయ్య ప్రతాప్ సి. రెడ్డి కి 2010లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటి రోజున చిరంజీవి కూడా పద్మవిభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.