Begin typing your search above and press return to search.

యానిమల్ చిరంజీవి వెర్షన్ చూశారా?

ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ చిత్రమే.. కిరాతకుడు. అందులోని కథ.. సన్నివేశాలతో 'యానిమల్'కు పోలికలు కనిపిస్తుండటం విశేషం.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:45 AM GMT
యానిమల్ చిరంజీవి వెర్షన్ చూశారా?
X

యానిమల్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఇప్పుడు మామూలుగా ఎదురు చూడట్లేదు. ఈ సినిమా ప్రి టీజర్ చూసినపుడే గూస్ బంప్స్ వచ్చాయి. ఇక టీజర్ అయితే అంచనాలను అమాంతం పెంచేసింది. లేటెస్ట్‌గా వచ్చిన ట్రైలర్ రెండు రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. 'అర్జున్ రెడ్డి'కి మించి ఈ చిత్రంతో సంచలనం రేపేలా ఉన్నాడు సందీప్ రెడ్డి. ట్రైలర్లోని షాట్ల మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అనేక మీమ్స్ కూడా తయారయ్యాయి వాటి మీద. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ చిత్రమే.. కిరాతకుడు. అందులోని కథ.. సన్నివేశాలతో 'యానిమల్'కు పోలికలు కనిపిస్తుండటం విశేషం.

ఆ సినిమాలోనూ తండ్రిని ఎంతో ఇష్టపడే కొడుకు పాత్రలోనే నటించాడు చిరు. బిజినెస్ వ్యవహారాల్లో పడి కొడుకును అస్సలు పట్టించుకోని తండ్రి పాత్రలో జగ్గయ్య నటించారు. చిరు ఒక కప్పు గెలిచి ఇంటికి వస్తే.. దాని గురించి తేలిగ్గా మాట్లాడి వెళ్లిపోతే హీరో మనసు గాయపడుతుంది. తండ్రి ప్రేమకు నోచుకోక హీరో కోపంతో రగిలిపోయే సన్నివేశాలు ఆ చిత్రంలోనూ ఉంటాయి. ఈ క్రమంలో హీరో చాలా వయొలెంట్‌గా మారతాడు కూడా. మరి యాదృచ్ఛికంగా ఈ రెండు చిత్రాలకూ పోలికలు ఉన్నాయా.. లేక తనెంతో ఇష్టపడే చిరంజీవి నటించిన సినిమా నుంచి బేసిక్ ఐడియా వరకు సందీప్ ఇన్‌స్పైర్ అయ్యాడా అన్నది తెలియదు కానీ.. 'యానిమల్' ట్రైలర్ వచ్చినప్పటి నుంచి 'కిరాతకుడు' మాత్రం ట్రెండ్ అవుతోంది. చిరు ఎప్పుడో ఈ తరహా పాత్ర చేసేశాాడంటూ అభిమానులు ఎగ్జైట్ అవుతూ ఆ సినిమా సన్నివేశాలను షేర్ చేస్తున్నారు.