Begin typing your search above and press return to search.

ఆయనకు మెగాస్టార్‌ మళ్లీ ఛాన్స్ ఇచ్చాడా..?

ఇప్పుడు మోహన్‌ రాజా దర్శకత్వంలో చిరంజీవి సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   25 May 2024 8:30 AM GMT
ఆయనకు మెగాస్టార్‌ మళ్లీ ఛాన్స్ ఇచ్చాడా..?
X

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న విశ్వంభర షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు మరే సినిమాకు కమిట్‌ అవ్వక పోవచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే ఆగస్టులో చిరంజీవి కొత్త సినిమా పట్టాలెక్కబోతుంది. మెగా స్టార్‌ సన్నిహితులు ఈ విషయాన్ని చెబుతున్నారు.

చిరంజీవితో గాడ్‌ ఫాదర్‌ సినిమాను రూపొందించిన దర్శకుడు మోహన్‌ రాజా అందుకు సంబందించిన పనుల్లో బిజీగా ఉన్నాడట. మోహన్ రాజా ఆ మధ్య నాగార్జునతో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు.

ఇప్పుడు మోహన్‌ రాజా దర్శకత్వంలో చిరంజీవి సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న వీరి కాంబో మూవీకి సంబంధించిన షూటింగ్‌ ను ఇదే ఏడాది ఆగస్టు లో ప్రారంభించే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

మొత్తానికి చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు మరో సినిమాను కూడా 2025 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు అంటూ మెగా ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. ఇది కచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. స్టార్‌ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తేనే ఇండస్ట్రీకి మనుగడ.