Begin typing your search above and press return to search.

గ‌ద్ద‌ర్ అవార్డుల‌పై మెగాస్టార్ రియాక్ష‌న్ !

దీని గురించి ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఆలొచించి త‌మ అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా సీఎం కోరారు.

By:  Tupaki Desk   |   30 July 2024 2:57 PM GMT
గ‌ద్ద‌ర్ అవార్డుల‌పై మెగాస్టార్ రియాక్ష‌న్ !
X

ఇటీవ‌లే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పేరిట‌ అవార్డులు తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స‌మాజానికి గ‌ద్ద‌ర్ అందించిన సేవల్ని గుర్తు చేస్తూ ఈ అవార్డుల్ని ప్ర‌వేశ పెడితే బాగుంటుంద‌న్న ప్ర‌తిపాద‌న తీసుకొచ్చారు. దీని గురించి ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఆలొచించి త‌మ అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా సీఎం కోరారు.

అయితే దీనిపై చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప‌రిశ్ర‌మ‌కు చెందిన పెద్ద‌లెవ‌రు నోరు మొద‌ప‌లేదు. దీంతో గద్ద‌ర్ పేరిట అవార్డులివ్వ‌డం ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు న‌చ్చ‌లేదా? అంద‌కే మౌనంగా ఉన్నారా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. ఈ విష‌యం పట్ల సీఎం రేవంత్ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌పై ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ఈనేప‌థ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి గతంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి మద్దతుగా తాను మాట్లాడిన ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసారు.

`తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ , సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ ప్రకటించడం హర్షణీయం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని రాసుకొచ్చారు.

చిరంజీవి తన పోస్టుకు తెలంగాణ సీఎంవోను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లను ట్యాగ్ చేశారు. దీంతో చిరంజీవి నుంచి అవార్డు ప‌ట్ల గ్రీన్ సిగ్నెల్ వ‌చ్చి న‌ట్లు అయింది. అయితే ఇంకా దీనిపై మాట్లాడాల్సిన‌పెద్దలు చాలా మంది ఉన్నారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలంతా కూడా స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. ఫిల్మ్ ఛాంబ‌ర్, మా అసోసియేష‌న్ కూడా త‌మ అభిప్రాయాల్పి పంచుకోవాల్సి ఉంది.